క్రైమ్ మిర్రర్, తమిళనాడు: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఈసారి పోటీ చేస్తున్న వారిలో అత్యంత సంపన్న అభ్యర్థిగా ఓ మహిళ నిలవడం విశేషం. తిరుచ్చి జిల్లా లాల్గుడి నియోజకవర్గం నుంచి అన్నా డీఎంకే అభ్యర్థిగా పోటీ చేస్తున్న లీమా రోజ్ .. రాష్ట్రంలోని అన్ని పార్టీల అభ్యర్థుల్లోకెల్లా సంపన్నురాలిగా ఉన్నారు. 58 ఏళ్ల లీమా రోజ్ తన కుటుంబ ఆస్తుల మొత్తం విలువను రూ.5,863 కోట్లుగా చూపించారు.
వ్యక్తిగతంగా తన పేరిట ఉన్న ఆస్తుల విలువే రూ.1049 కోట్లు అని అఫిడవిట్ లో లీమా రోజ్ పేర్కొన్నారు. లాటరీ టికెట్ల విక్రయ సంస్థ అధినేత అయిన మార్టిన్ సతీమణే ఈ లీమా రోజ్. ఇటీవలే అన్నాడీఎంకేలోచేరి టికెట్ సంపాదించి ఎన్నికల బరిలో దిగారు. దీంతో ఆమె హామీల కన్నా ఆమెకు ఉన్న ఆస్తుల అంశమే తమిళనాడు ఎన్నికల్లో ఇప్పుడు పెద్ద చర్చనీయాంశంగా మారింది.
