తెలంగాణ

58 శాతం పూర్తయిన ఇంటింటి సర్వే

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సమగ్ర కుటుంబ ఇంటింటి సర్వే (సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ కుల సర్వే 2024) విజయవంతంగా సాగుతోంది. అన్ని వర్గాల సంక్షేమం, సామాజిక సాధికారత లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఈ సర్వే దేశమందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

నవంబర్ 6న ప్రారంభమైన ఈ సర్వే.. 12 రోజుల్లోనే సగానికిపైగా పూర్తయింది. ఆదివారం (నవంబర్ 17) నాటికి 58.3% సర్వే పూర్తయింది. సర్వేలో ముందుగా నవంబర్ 6వ తేదీ నుంచి 8వ తేదీ వరకు ఇళ్ల గణనను ప్రభుత్వం చేపట్టింది. సర్వేలో బాగంగా రాష్ట్రంలో మొత్తం 1,16,14,349 ఇళ్లను గుర్తించింది. నవంబర్ 9వ తేదీ నుంచి ఇంటింటి వివరాల సర్వే ప్రారంభించింది. మొత్తం రాష్ట్రంలో ఇప్పటివరకు 67,72,246 గృహాల సర్వే పూర్తయింది.

బ్లాకులు:

గ్రామీణం: 52,493
పట్టణం: 40,408
మొత్తం: 92,901

ఎన్యుమరేటర్లు:

గ్రామీణం: 47,561
పట్టణం: 40,246
మొత్తం: 87,807

పర్యవేక్షకులు:

గ్రామీణం: 4,947
పట్టణం: 3,841
మొత్తం: 8,788

Back to top button