Tuesday, March 10, 2026
Homeజాతీయంజగన్నాథుడి రథయాత్రలో అపశృతి, తొక్కిసలాటలో 500 మందికి గాయాలు!

జగన్నాథుడి రథయాత్రలో అపశృతి, తొక్కిసలాటలో 500 మందికి గాయాలు!

Jagannath Rath Yatra 2025: ఒడిశాలో జరుగుతున్న ఆధ్యాత్మిక ఉత్సవలం జగన్నాథుడి అపశృతి చోటు చేసుకుంది. రథం లాగే క్రమంలో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 500 మందికి పైగా భక్తులు గాయపడ్డారు. వీరిలో పలువురు మూర్చపోయారు. వెంటేనే స్పందించిన భద్రతా సిబ్బంది వారిని హాస్పిటల్ కు తరలించారు. వారంతా కోలుకుంటున్నట్లు అధికారులు తెలిపారు. ఎవరికీ ఎలాంటి ప్రాణహాని లేదని వైద్యులు చెప్పినట్లు వెల్లడించారు. త్వరలోనే వారిని హాస్పిటల్ నుంచి డిశ్చార్జి చేస్తారని ఒడిశా హెల్త్ మినిస్టర్ ముఖేష్ మహాలింగ్ తెలిపారు.

రథం లాగే క్రమంలో తొక్కిసలాట

ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈసారి కూడా (జూన్ 27న) రథయాత్ర అంగరంగ వైభవంగా ప్రారంభం అయ్యింది. ఈ వేడుకను చూసేందుకు  లక్షలాదిగా భక్తులు తరలివచ్చారు. ఉదయం జగన్నాథుడు, దేవత సుభద్ర, బలభద్రుడి విగ్రహాలను ఆలయం నుంచి రథాల మీదికి ఎక్కించారు. ఆ తర్వాత రథాలను లాగడం మొదలుపెట్టారు. సాయంత్రం 4.08 గంటలకు బలభద్రుడి తలధ్వజ రథం బయల్దేరింది. ఆ తర్వాత సుభద్ర దేవి దర్పదలన్ రథం, చివరకు జగన్నాధుడి నంది ఘోష రథం బయల్దేరాయి. ఈ సమయంలోభక్తుల జయ జయ ధ్వానాలతో ఆ ప్రాంతం మరింత ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. ప్రభువు బల భద్రుల రథాలను శ్రీగుండిచా ఆలయం వైపు లాగే క్రమంలో తొక్కిసలాట జరిగింది.

భారీ భద్రత ఏర్పాటు చేసినా..

రథ యాత్రకు లక్షలాదిగా భక్తులు తరలి వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ఒడిశా ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేసింది. ఆలయ ప్రాంతంలో ప్రాథమిక ఆరోగ్యం కేంద్రాలను ఏర్పాటు చేసింది. భక్తులకు సరిపడ నీరు, గ్లూకోజ్ అందుబాటులో ఉంచారు. ఈ వేడుకలకు భద్రత కోసం ఒడిశా పోలీసులతోపాటు కేంద్ర బలగాలు, ఎన్‌ఎస్‌జీ కమెండోలను రంగంలోకి దింపారు. సుమారు 10 వేల మంది భద్రతా సిబ్బందితో సెక్యూరిటీ ఏర్పాటు చేశారు. అయినప్పటికీ ఈ ఘటన జరగడం పట్ల ఆలయ కమిటీ విచారం వ్యక్తం చేసింది.

Read Also: 6 ఏండ్ల తర్వాత కైలాష్ మానస సరోవర యాత్ర!

Anjibabu Chittimalla
Anjibabu Chittimallahttps://crimemirror.com/
గత 16 సంవత్సరాలుగా మీడియా రంగంలో పని చేస్తున్నాను. ABN ఆంధ్రజ్యోతి, టీ-న్యూస్‌, వెలుగు దినపత్రిక, V6 చానెల్ లో జర్నలిస్టుగా పని చేశాను.2022 నుంచి 2024 వరకు ‘ABP దేశం’కు ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా పని చేశాను. BIG TVకి ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా ట్రావెల్, వైరల్, లైఫ్ స్టైల్, టెక్ అండ్ సైన్స్, ఆటో, క్రైమ్ వార్తలు అందించాను.ప్రస్తుతం ‘క్రైమ్ మిర్రర్’కు డిప్యూటీ ఎడిటర్ ఇన్ చీఫ్ గా విధులు నిర్వహిస్తున్నాను.
RELATED ARTICLES

Most Popular

Recent Comments