
క్రైమ్ మిర్రర్, సినిమా న్యూస్:- తెలుగు చిత్ర పరిశ్రమలో రేపు 5 చిన్న సినిమాలు విడుదల కాబోతున్నాయి. క్రిస్మస్ కానుకగా ఈ సినిమాలన్నీ కూడా రేపు బరిలో దిగబోతున్నాయి. బాక్సాఫీస్ వద్ద ఇటీవల ఎన్నో చిన్న సినిమాలు భారీ స్థాయిలో కలెక్షన్లు రాబడుతున్నాయి. సినిమా కథ బాగుంది అంటే ప్రేక్షకులు ఆ సినిమాలను చాలా బాగా ఆదరిస్తుంటారు. అయితే రేపు ఒక్కరోజులోనే ఏకంగా ఐదు సినిమాలు విడుదల కాబోతున్నాయి. వీటిలో నటించే హీరోలు అందరూ కూడా చాలా యంగ్ వాళ్లే. ఆది సాయికుమార్ ‘శంబాల’, శ్రీకాంత్ నాయుడు రోషన్ నటించినటువంటి ‘ఛాంపియన్’, శివాజీ, నవదీప్ కలిసి నటించినటువంటి ‘దండోరా’, హర్రర్ ఫిలిం ‘ఈషా’, యూత్ ఫుల్ మూవీ ‘పతంగ్’ ఈ సినిమాలన్నీ కూడా రేపు రిలీజ్ కాబోతున్నాయి. మరోవైపు వృషభ మరియు మార్క్ లాంటి డబ్బింగ్ సినిమాలు తెలుగులో విడుదల కాబోతున్నాయి. దీంతో మొత్తంగా చూసుకుంటే దాదాపు ఏడు సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. ఇప్పటికే ఈ సినిమాలకు సంబంధించి చిత్ర బృందాలు భారీగానే ప్రమోషన్స్ చేశాయి. మరి వీటిలో రేపు ఏ సినిమాకు మీరు వెళ్ళబోతున్నారు లేదా ఏ సినిమా బ్లాక్ బస్టర్ అవుతుంది అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి.
Read also : ఈరోజు అర్ధరాత్రి నుంచి NETFLIX లో స్ట్రీమింగ్ కానున్న “బాహుబలి ది ఎపిక్”
Read also : పర్సనాలిటీ రైట్స్ పొందిన తొలి భారత క్రీడాకారుడు?





