క్రైమ్ మిర్రర్, తెలంగాణ స్టేట్ బ్యూరో: మెదక్ జిల్లా, కుల్చారం మండలం, పొతిరెడ్డిపల్లి గ్రామంలో నాలుగు ఏళ్ల బాలుడు చెరువులో పడి మృతి చెందిన సంఘటన శనివారం (ఫిబ్రవరి 28, 2026) ఉదయం వెలుగులోకి వచ్చింది.
స్థానికులు తెలిపిన వివరాల ప్రకారంగా మెదక్ జిల్లా, కుల్చారం మండలం, పొతిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన సారా వెంకటేష్ కుమారుడు సారా బిట్టు (4), శుక్రవారం సాయంత్రం తన ఇంటి నుండి కనిపించకుండా పోయాడు. కుటుంబ సభ్యులు గాలించినప్పటికీ ఆచూకీ లభించలేదు.
శనివారం ఉదయం గ్రామ సమీపంలోని చెరువులో బాలుడి మృతదేహం కనిపించింది. బాలుడి మృతిపై పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. గుర్తుతెలియని వ్యక్తులు బాలుడిని హత్య చేసి మృతదేహాన్ని చెరువులో పడేసి ఉండవచ్చని ప్రాథమికంగా భావిస్తున్నారు. కళ్లముందే తిరుగాడిన బిడ్డ ఇక లేడన్న నిజాన్ని తల్లిదండ్రులు తట్టుకోలేక కన్నీరుమున్నీరవుతుంటారు.
ఈ ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
