తెలంగాణ

ఫుడ్ పాయిజన్‌తో 38 మంది విద్యార్థులు మృతి.. తెలంగాణలో ఘోరం

రాష్ట్రంలోని గురుకుల విద్యాలయాలు, పాఠశాలల్లో నెలకొన్న దుస్థితిపై బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. గురుకుల, పాఠశాల విద్యను రేవంత్‌ రెడ్డి సర్కార్‌ సంక్షోభంలోకి నెట్టిందని మండిపడ్డారు. నవంబర్ 30 నుంచి డిసెంబర్ 7 వరకు రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్ గురుకుల బాట కార్యక్రమం నిర్వహించనున్నట్లు ప్రకటించారు. గురుకుల బాట కార్యక్రమంలో భాగంగా గురుకులాలు, కేజీబీవీలు, మోడల్ స్కూల్స్, ప్రభుత్వ రెసిడెన్షియల్ పాఠశాలలు, కాలేజీలను బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, పార్టీ సీనియర్ నాయకులు, మహిళా నేతలు పరిశీలించనున్నారని తెలిపారు.

గురుకులాలు, కేజీబీవీ, మోడల్ స్కూళ్ల పరిస్థితులను అధ్యయనం చేసేందుకు బీఆర్ఎస్ తరఫున అధ్యయన కమిటీ వేస్తున్నట్లు కేటీఆర్‌ తెలిపారు. ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ ఆధ్వర్యంలో ఐదుగురు సభ్యులతో గురుకుల అధ్యయన కమిటీ వేశామని చెప్పారు. ఈ అధ్యయన కమిటీ బీఆర్‌ఎస్‌ పార్టీకి నివేదిక సమర్పిస్తుందని తెలిపారు. ఈ నివేదిక అంశాలను శాసనసభలో లేవనెత్తుతామని స్పష్టం చేశారు.

గురుకుల, పాఠశాల విద్యను రేవంత్‌ రెడ్డి సర్కార్‌ సంక్షోభంలోకి నెట్టిందని కేటీఆర్‌ విమర్శించారు. 11 నెలల్లో 52 మంది విద్యార్థుల మరణించారని.. ఇందులో 38 ఫుడ్ పాయిజన్ సంఘటనలు ఉన్నాయని తెలిపారు. పాలన గాలికొదిలేసి నేరపూరిత నిర్లక్ష్యంతో ముఖ్యమంత్రి విద్యార్థులను పొట్టన బెట్టుకుంటున్నారని మండిపడ్డారు. రాష్ట్రానికి విద్యాశాఖ మంత్రి లేడని.. ముఖ్యమంత్రికి ఢిల్లీకి తిరిగేందుకే సమయం సరిపోతలేదని విమర్శించారు. విద్యార్థులు చనిపోతున్నా ఒక్క సమీక్ష కూడా నిర్వహించలేదని ఆరోపించారు.

మరిన్ని వార్తలు చదవండి…

అయ్యప్ప స్వాములకు బ్రీత్ అనలైజర్ టెస్ట్.. ఆర్టీసీలో దుమారం

కోటి 10 లక్షల ఇండ్లలో సమగ్ర సర్వే పూర్తి

సీఎం రేవంత్ జిల్లా మరో దారుణం.. పిల్లల సాంబారు,చట్నీలో బొద్దింక

అయ్యప్ప మాలలో కడప దర్గాకు రాంచరణ్

కుర్ కూరే తినడం వల్లే పిల్లలకు అస్వస్థత.. హైకోర్టుకు సర్కార్ రిపోర్ట్

ఆర్జీవి కోసం ఏకంగా రెండు రాష్ట్రాల్లో గాలింపు చర్యలు!

8 నెలల తర్వాత కవిత ఫవర్ ఫుల్ స్పీచ్.. సీఎం రేవంత్‌కు టెన్షన్

రేవంత్ రెడ్డికి రాహుల్ క్లాస్.. అదాని 100 కోట్లు రిటర్న్

గజగజ వణుకుతున్న జనాలు.. తెలంగాణలో చలి పంజా

పాతబస్తీలో నేను చెప్పిందే ఫైనల్.. మేయర్‌కు MIM ఎమ్మెల్యే వార్నింగ్

సీఎం రేవంత్‌కు సీపీఎం నేత తమ్మినేని వార్నింగ్

డేంజర్ లో హైదరాబాద్.. బయటికి వస్తే అంతే

రైతుల సంబరం.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు

సచివాలయంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేకు ఘోర అవమానం

రేవంత్ టచ్ లోకి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు.. జంప్ అయ్యేది వీళ్లే..!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button