
క్రైమ్ మిర్రర్ తెలంగాణ బ్యూరో:- తెలంగాణ ప్రభుత్వం పోలీసు శాఖలో భారీగా బదిలీలు చేపట్టింది. 32 మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు.
బదిలీలు మరియు పోస్టింగ్‌ల వివరాలు:
>>>>సీనియర్ ఐపీఎస్ అధికారి దేవేందర్ సింగ్ చౌహాన్‌కు అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (ADGP), పర్సనల్గా పోస్టింగ్ ఇచ్చారు.
>>>>జే. పరిమళ హన నూతన్ జాకబ్ను క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్‌మెంట్ (CID) డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (DIG)గా నియమించారు.
>>>>చేతన్ మైలబత్తులను RBVRR తెలంగాణ పోలీస్ అకాడమీ (TGPA) డిప్యూటీ డైరెక్టర్‌గా బదిలీ చేశారు.
>>>>నారాయణ రెడ్డి మహేశ్వరం జోన్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (DCP)గా బాధ్యతలు స్వీకరించనున్నారు.
వైభవ్ గైక్వాడ్‌ను హైదరాబాద్ టాస్క్ ఫోర్స్‌కు కొత్త ఎస్పీగా నియమించారు.
>>>>నల్గొండ జిల్లా దేవరకొండ ఎఎస్పీ మౌనిక, ఆదిలాబాద్ కు అడిషనల్ ఎస్పీగా బదిలీ చేశారు..
పాత ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నారని భావించిన లేదా ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం ఒకే చోట ఎక్కువ కాలం పనిచేసిన అధికారులను ఈ బదిలీల్లో భాగంగా కీలక స్థానాల నుంచి మార్చడం జరిగింది.
ఈ బదిలీల ద్వారా రాష్ట్ర పోలీసు వ్యవస్థలో వ్యవస్థాగత మార్పులు తీసుకురావాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.





