Wednesday, March 11, 2026
Homeతెలంగాణప్రభుత్వ పాఠశాలలో సౌకర్యార్థం కోసం ముందడుగు వేసిన 2001-2002 బ్యాచ్ విద్యార్దులు

ప్రభుత్వ పాఠశాలలో సౌకర్యార్థం కోసం ముందడుగు వేసిన 2001-2002 బ్యాచ్ విద్యార్దులు

మునుగోడు, క్రైమ్ మిర్రర్ :- మునుగోడు మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 2001-02 సంవత్సరంలో పదవ తరగతి పూర్తి చేసుకున్న పూర్వ విద్యార్దులు పాఠశాలపై ఉన్న మమకారంతో పాఠశాలలో సౌకర్యార్థం పాఠశాలకు 1 బీరువా అందజేశారు. 4 సీసీ కెమెరాలు ఏర్పాటు తోపాటు 2025 – 26 సంవత్సరంలో 10 వ తరగతిలో పాఠశాలలో మొదటి ర్యాంకు సాధించిన విద్యార్థికి 12 వేల రూపాయలు, ద్వితీయ స్థానంలో నిలిచిన విద్యార్ధికి 7 వేల రూపాయలు,తృతీయ స్థానంలో నిలిచిన విద్యార్ధికి 5 వేల రూపాయలు నగదు ప్రోత్సాహ బహుమతులు అందజేస్తామనీ ప్రకటించడం జరిగింది. ఇందులో ముఖ్య అతిథిగా
మండల విద్యాధికారి తల్లమల్ల మల్లేశం పాల్గొని మాట్లాడారు. చదివిన పాఠశాలను చదువు చెప్పిన గురువులను మరచిపోకుండా గుర్తుకు ఉంచుకొని పాఠశాల సౌకర్యార్థం ఏర్పాటు చేయడానికి ముందుకు రావడం..ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్దులకు ఆర్ధికంగా బరోసా కల్పించడం అభినందనీయం అని,ప్రతి ఒక్కరు 2001 – 02 పూర్వ విద్యార్దులను ఆదర్శంగా తీసుకొని పాఠశాల అభివృద్ధికి ముందుకు రావాలని కోరారు.

పాఠశాల ప్రధానోపాధ్యాయులు బాల ప్రసాద్ మాట్లాడుతూ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ప్రథమ ,ద్వితీయ, తృతీయ నగదు బహుమతులు అందించి విద్యార్థులకు వెన్నంటి ఉండడానికి ముందుకు రావడం అభినందనీయం అన్నారు. పాఠశాల మనది మన అందరిదీ ప్రతి ఒక్కరు ఈ పూర్వ విద్యార్థులను ఆదర్శంగా తీసుకోవాలని కోరారు. పూర్వ విద్యార్దులు మాట్లాడుతూ నేటి బాలలే రేపటి పౌరులు అని,విద్యార్ది భవిష్యత్తు తరగతి గదిలోనే రూపుదిద్దుకోవడం జరుగుతుంది, విద్యార్దులను ఉత్తములుగా తీర్చిదిద్దే బాధ్యత ఉపాద్యాయులపైన ఉందన్నారు. క్రమశిక్షణతో ఉండి గురువులను గౌరవిస్తూ ,ప్రతి ఒక్కరు కష్టపడి చదివి పాఠశాలకు,గ్రామానికి, తల్లితండ్రులకు మంచి పేరు తేవాలని, ఉన్నత స్థాయిలో ఎదగాలని, భవిష్యత్ లో మీరు కూడా చదివిన పాఠశాల అభివృద్ధికి తోడ్పాటును అందించాలని కోరారు..పాఠశాల అభివృద్ధికి ఎప్పుడు తోడ్పాటును అందిస్తామని పేర్కొన్నారు..ఈ కార్యక్రమంలో.2001 – 02 పూర్వ విద్యార్ధులు పెరుమాళ్ళ ప్రమోద్ కుమార్,కూరెళ్ళ జ్ఞానేశ్వర్,ఈద ప్రవీణ్,బొల్లు సైదులు,చెరుకు నరేందర్, ముచ్చపోతుల శ్రవణ్ కుమార్ నారగోని శ్రీశైలం,పాఠశాల చైర్మన్ పందుల ఎల్లమ్మ,పాఠశాల ఉపాధ్యాయులు కే సత్తిరెడ్డి,రత్నయ్య,అన్నపురెడ్డి, వెంకటేశ్వర్లు,ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది.పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments