ప్రస్తుతం ఏ సోషల్ మీడియా లో చూసిన సరే సైబర్ మోసాలంటూ ప్రతిరోజు ఎంతోమంది ప్రజలు మేము మోసపోయాం అంటూ పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతూ ఉన్న సందర్బాలు మనం చాలానే చూసి ఉంటాం. ఇలాంటివి మన భారతదేశం లో ఇంకా ఇంకా రోజుకి రోజు పెరుగుతున్నాయి తప్ప అసలు తగ్గట్లేదు. మరి సైబర్ నేరగాళ్ళు కూడా వాళ్ళ యొక్క తెలివితేటలను వినియోగించుకుని మరింత అప్డేట్ అవుతూ మరెన్నో మోసాలకు పాల్పడుతున్నారు. కాబట్టి కేంద్రం నుండి అలాగే పోలీస్ విభాగాల నుండి ఎప్పటికప్పుడు ఈ భారీ సైబర్ మోసాలు గురించి ఎప్పటికప్పుడు సమాచారం అనేది మనకి తెలియచేస్తున్నారు. అయిన సరే కొంతమంది బద్ధకం, అజ్ఞానం వళ్ళ సులభంగా మోసపోతున్నారు. అయితే ఈ సైబర్ మోసాలు అనేవి రోజుకి రోజు పెరగడం వల్ల పెద్ద ఎత్తున పోలీస్ లు అలెర్ట్ అయ్యారు.
సైబర్ నేరాలకు పాల్పడుతున్న 18 మందిని హైదరాబాద్ పోలీస్ లు అరెస్ట్ చేసారు. హైదరాబాద్ పోలీస్ లు ఈ మధ్య సైబర్ నేరగాళ్ళు ఎక్కువ అవ్వడం తో ప్రత్యేకంగా 6 బృందాలను ఏర్పాటు చేసారు. కర్ణాటక, మహారాష్ట్ర, రాజస్థాన్, హైదరాబాద్ లలో ప్రత్యేకంగా పోలీస్ బృందలని ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపట్టి హైటెక్ నేరగాళ్ళు అయినటువంటి 18 మంది సైబర్ నేరగాళ్ళను పట్టుకుని అరెస్ట్ చేసారు. అయితే అరెస్ట్ చేసిన వాళ్లపై హైదరాబాద్ పోలీస్ స్టేషన్ లలో ఇదివరకే దాదాపుగా 45 కేసులు ఉన్నాయట. అంతేకాకుండా వీళ్లపై దేశావ్యాప్తంగా 320 కేసులు ఉన్నట్లు పోలీస్ లు తెలపడంతో అందరూ కూడా ఒక్కసారిగా అవ్వాక్కయ్యారు. ఇక ఇప్పటివరకు వీళ్ళు ఏమేమి చేసారో,మోసం చేసి ఎంత డబ్బు సంపాదించారో తెలిస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. నిందితుల దగ్గరనుండి పోలీసులు 5 లక్షల నగదును అలాగే 26 మొబైల్ ఫోన్స్ వీటితోపాటుగా 16 ఎటిఎం డెబిట్ కార్డ్స్ ను స్వాదీనం చేసుకున్నారు.
కొరియర్ పేర్లతో అలాగే పెట్టుబడులని ఇవేకాకుండా అధికారులమని చెప్పుకుంటూ ఇలా దేశావ్యాప్తంగా ఇప్పటివరకు ఎన్నో మోసాలుకు పాల్పడ్డారని పోలీస్ ల విచారణలో తేల్చి చెప్పారు. అలాగే నిందితుల అకౌంట్ లలో కోటి రూపాయల నగదు ఉండడం చూసి పోలీస్ లు కూడా షాక్ కి గురయ్యారు. ఆ నగదుని అంత పోలీస్ లు సీజ్ చేసారు. తెలంగాణ లోనే ఏకంగా 6 కోట్లు ఈ సైబర్ నేరగాళ్ళు కజేసినట్లు పోలీస్ ల విచారణలో తెల్చారు.
దీనంతటకి కారణం ముక్యంగా ప్రజలే. సైబర్ నేరగాళ్ల ఆలోచన విధానం, తెలివి ఒకెత్తు అయితే ప్రజలు విజ్ఞానం మరో ఎత్తు. కాబట్టి సులభంగా సైబర్ నేరగాళ్ళు ప్రజలను సులభంగా మోసం చేస్తున్నారు. కాబట్టి పోలీస్ లు వారిపని వాళ్ళు చేస్తారు. మొదటగా మరీ ముక్యంగా మనం జాగ్రత్తగా ఉండాలి. ఆలా అయితే ఈ సైబర్ నేరగాళ్ల నుండి తప్పించుకోగలం. ముక్యంగా వీటిపై ప్రతి ఒక్కరికి అవగాహన అనేది లేకపోవడం వల్లే ఇలా జరుగుతుంది. కాబట్టి ప్రతిఒక్కరు కూడా ఈ రోజుల్లో మొబైల్ ఫోన్స్ అనేవి వాడుతున్నారు కాబట్టి ప్రతి ఒక్కరు స్పామ్ కాల్స్ పట్ల జాగ్రత్తగా ఉండాలని పోలీస్ లు చెప్తున్నారు.