తెలంగాణ

పెబ్బేరు లో ఘనంగా 14వ వార్షికోత్సవ శోభ యాత్ర

పెబ్బేరు, క్రైమ్ మిర్రర్ :- పెబ్బేరు మున్సిపల్ కేంద్రంలోని శ్రీ శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి దేవాలయం 14వ ఆలయ వార్షికోత్సవం పురస్కరించుకొని సోమవారం తెల్లవారుజాము నుంచి అయ్యప్ప స్వామికి అష్టాభిషేకాలతో అభిషేకాలు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజా కార్యక్రమం అనంతరం ఉత్సవ విగ్రహాన్నితో పట్టణ పురవీధుల గుండా అంగరంగ వైభవంగా శోభాయాత్ర నిర్వహించారు. స్థానిక సుభాష్ చౌరస్తా వద్ద అయ్యప్ప స్వాములు ఎరిమేలిలో రంగులు పూసుకుని పేటైతుళ్ళి ఎలా ఆడుతారొ…. అదేవిధంగానే స్థానిక సుభాష్ చౌరస్తా లో అయ్యప్ప స్వాములు పేటైతుళ్ళి రంగులతో ఆడి అనంతరం బీచుపల్లి కృష్ణానదిలో అయ్యప్ప స్వామి ఉత్సవ విగ్రహానికి పంబ స్నానం చేయించి అభిషేకాలతో ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించారు. సాయంకాలం అయ్యప్పస్వామి ప్రత్యేక పూజలు చేశారు. పడిపూజ కార్యక్రమాన్నికి ముఖ్యఅతిథిగా అఖిలభారత అయ్యప్ప దీక్ష ప్రచార సమితి వ్యవస్థాపకులు శ్రీ రాజ్ దేశ్ పాండే తో పాటు ఆలయ కమిటీ సభ్యులు పాల్గొని పడిపూజ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా విజయవంతం చేశారు. ఆలయ కమిటీ సభ్యులు భక్తులకు తీర్థ ప్రసాదం. అల్పాహార కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో. ఆలయ కమిటీ సభ్యులు. ఈశ్వర్ స్వామి. శ్రీనివాసులు స్వామి. ప్రదీప్ గౌడ్ స్వామి. శ్రీనివాస్ గౌడ్ స్వామి. హనుమంత్ రెడ్డి స్వామి. బాలవర్ధన్ స్వామి. వీర బొజ్జ స్వామి. బుజ్జి స్వామి. మధు స్వామి. ఎల్లయ్య స్వామి. వెంకట రాములు స్వామి.శాంతన స్వామి. ఎల్లారెడ్డి స్వామి. మరియు పెబ్బేర్ అయ్యప్ప కన్నె స్వాములు గురు స్వాములు పాల్గొన్నారు.

Read aslo : శబరిమల భక్తులకు అలర్ట్.. తెరుచుకున్న ఆలయం.. మూసి ఉంచే తేదీలు ఇవే!

Read also : మీ వల్ల మాకు ఎంతో నష్టం.. ఐ బొమ్మ రవి అరెస్టు పై స్పందించిన చిరంజీవి!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button