క్రైమ్ మిర్రర్, ఎల్బ్ నగర్ ప్రతినిధి : తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ప్రధాన అనుచరుడిని జనం తన్ని తరిమేశారు. అధికార పార్టీ నేత అన్న అహంతో తనను ఎవరూ ఏమి చేయలేరంటూ ప్లాట్ యజమానులను బెదిరించే ప్రయత్నం చేయగా.. అంతా ఏకమై తరిమికొట్టారు. పట్టుకుని పోలీసులకు అప్పగించారు. హయత్ నగర్ శివారులోని బాగ్ హయత్ నగర్ లో జరిగిన ఈ ఘటన తీవ్ర దుమారం రేపుతోంది.
మునుగోడు నియోజకవర్గ కాంగ్రెస్ నాయకుడు వేమిరెడ్డి సురేందర్ రెడ్డిని తన్ని, తరిమి కొట్టారు బాగ్ హయత్ నగర్ సోమ లింగేశ్వర నగర్ కాలనీకి చెందిన 101 మంది ప్లాట్ ఓనర్స్. 1985వ సంవత్సరంలో బాగ్ హయత్ నగర్ లో సర్వేనెంబర్ 180 &187లో మొత్తం 8 ఎకరాల 20 గుంటల భూమిని భూ యజమాని 101ప్లాట్ల రూపంలో ఇతరులకు అమ్మాడు. రైతు దగ్గర ప్లాట్లు కొన్న వారందరూ సోమలింగేశ్వర నగర్ కాలనీ పేరు మీద Regd no.672/ 2001 నెంబర్ తో కాలని రిజిస్ట్రేషన్ చేసుకున్నారు
ఒక సారి అమ్మిన భూమిని వెంకట్ రెడ్డి మరియు కోటమిరెడ్డి బ్రదర్స్ అనుచరుడు వేమిరెడ్డి సురేందర్ రెడ్డి అనే ఇద్దరు వ్యక్తులు కలిసి రైతును మభ్యపెట్టి 2005లో వ్యవసాయ భూమిగా 2వ సారి అక్రమ పద్ధతిలో డబుల్ రిజిస్ట్రేషన్ చేసుకున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. గతంలో ఈ భూమి తనది అని ప్లాటు ఓనర్ లను సురేందర్ రెడ్డి బెదిరించారని తెలుస్తోంది. అయితే సోమలింగేశ్వర నగర్ 101 మంది ప్లాట్ ఓనర్స్ అందరూ .. ఆ భూమి ముందే మేం కొన్నామంటూ తమ రిజిస్ట్రేషన్ పత్రాలతో రంగారెడ్డి జిల్లా కోర్టుకు హైకోర్టుకు వెళ్లారు. మూడేళ్ల క్రితం రెండు కోర్టుల్లోనూ ప్లాటు ఓనర్స్ కు అనుకూలంగా తీర్పులు వచ్చాయి.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో సురేందర్ రెడ్డి మళ్లీ భూములపై కన్నేశారని చెబుతున్నారు. అధికార పార్టీ అండతో ప్లాట్ల దగ్గరికి వెళ్లి తన AP29 BW 4568 ఇన్నోవా కారుతో రైతులు వేసుకున్న టెంటు కర్రను గుద్దాడు. కారు దిగి టెంటూ కింద ఉన్న ప్లాట్ ఓనర్స్ ను బెదిరిస్తూ ఎవర్రా మీరందరూ ఈ భూమి నాది.. మీ అంతు చూస్తా అంటూ భయభ్రాంతులకు గురి చేశారు. దీంతో ప్లాట్ ఓనర్స్ అందరూ ఏకమై.. సురేందర్ రెడ్డిని తన్ని తరిమి కొట్టారు. 100కు డయల్ చేసి హయత్ నగర్ పోలీసులకు అప్పగించారు. తమపై దౌర్జన్యం చేశాడంటూ సురేందర్ రెడ్డిపై ప్లాట్ ఓనర్స్ కేసు పెట్టారు.