కేటీఆర్ కు రాఖీ కట్టి పీకల్లోతు కష్ఠాల్లో పడ్డారు మహిళా కమిషన్ సభ్యులు. మహిళా కమిషన్ ముందు హాజరైన కేటీఆర్‌కి రాఖీలు కట్టడంపై ప్రభుత్వం సీరియస్ గా స్పందించింది. కేటీఆర్ కు రాఖీలు కట్టిన మహిళా కమిషన్ సభ్యులకు నోటీసులు ఇవ్వాల్సిందిగా మహిళా కమిషన్ సెక్రటరీకి ఆదేశాలు జారీ చేసింది.
మహిళా కమిషన్ నోటీసులతో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విచారణకు హాజరైన సందర్భంగా నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. భారీ భద్రత మధ్య కేటీఆర్‌ను మహిళా కమిషన్ కార్యాలయం లోపలికి తీసుకెళ్లారు పోలీసులు. కేటీఆర్‌తో పాటు మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్ సహా వాకాటి సునీత, గండ్ర జ్యోతిని మహిళా కమిషన్ కార్యాలయంలోకి అనుమతించారు. కార్యాలయంలోకి వచ్చిన కేటీఆర్‌ను మహిళా కమిషన్ సభ్యులు ఆప్యాయంగా పలుకరించారు. కేటీఆర్‌కు రాఖీలు కట్టి తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇదేం ట్విస్టు అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.