
తెలంగాణ ప్రభుత్వం కొత్తగా అమలు చేస్తున్న నాలుగు పథకాలతో గ్రామాల్లో ఉద్రిక్తతలు తలెత్తుతున్నాయి. పథకాల్లో తమ పేర్లు లేని వాళ్లు ఆందోళనకు దిగుతున్నారు. అధికారులను నిలదీస్తున్నారు. కొందరు దాడులు చేయడానికి కూడా ప్రయత్నిస్తున్నారు. వరంగల్ జిల్లాలో అయితే ఓ వ్యక్తి తనకు ఇందిరమ్మ ఇల్లు రాకుంటే చంపేస్తానని గ్రామ కార్యదర్శిని బెదిరించాడు. ఇందిరమ్మ ఇల్లు లిస్టులో తన పేరు లేదని పంచాయతీ కార్యదర్శిని చంపుతానని బెదిరించాడు కాంగ్రెస్ కార్యకర్త
వరంగల్ జిల్లా రాయపర్తి మండలం వాంకుడోతు తండాలో ఇందిరమ్మ ఇండ్ల లిస్టులో తన పేరు లేదని పంచాయతీ కార్యదర్శి అభిలాష్‌ను చంపుతానని బెదిరించాడు కాంగ్రెస్ కార్యకర్త వాంకుడోతు రవీందర్.ఎకరం భూమి అమ్మైనా నిన్ను చంపేస్తానని ఫోన్ చేసి బెదిరించాడు. మాతో రాజకీయాలు చేయొద్దంటూ కాంగ్రెస్ కార్యకర్త బెదిరింపులకు దిగడంతో.. ప్రాణభయంతో రాయపర్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు గ్రామ పంచాయతీ కార్యదర్శి అభిలాష్