Friday, March 20, 2026
Homeఅంతర్జాతీయంబ్రేకింగ్ న్యూస్: పదోవ తరగతి పరీక్షా వాయిదా..?

బ్రేకింగ్ న్యూస్: పదోవ తరగతి పరీక్షా వాయిదా..?

క్రైమ్ మిర్రర్, తెలంగాణ స్టేట్ బ్యూరో: రంజాన్ (ఈదుల్ ఫితర్) పండుగ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2026 మార్చి 21న జరగాల్సిన పదో తరగతి (SSC) ఇంగ్లీష్ పరీక్షను వాయిదా వేసింది. తొలుత మార్చి 20న రంజాన్ సెలవు ప్రకటించినప్పటికీ, నెలవంక కనిపించని కారణంగా పండుగను మార్చి 21న జరుపుకోవాలని వక్ఫ్ బోర్డు సూచించింది.

దీంతో ప్రభుత్వం సెలవు దినాన్ని మార్చి 21కి మార్చింది. వాయిదా పడిన ఇంగ్లీష్ పరీక్షను (పేపర్ కోడ్: 13E & 14E) ఏప్రిల్ 2, 2026 (గురువారం) నాడు నిర్వహించనున్నారు. ఉదయం 9:30 గంటల నుండి మధ్యాహ్నం 12:45 గంటల వరకు.

ఈ మార్పు కేవలం ఇంగ్లీష్ పరీక్షకు మాత్రమే పరిమితం. మిగిలిన పరీక్షలు మునుపటి షెడ్యూల్ ప్రకారమే జరుగుతాయి. విద్యార్థులు పాత హాల్ టిక్కెట్లనే ఉపయోగించి పరీక్షకు హాజరుకావచ్చు అని తెలిపారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments