తెలంగాణ

1,000 కోట్లు లాస్.. తెలంగాణలో రియల్ ఎస్టేట్ ఢమాల్

తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి రోజురోజుకు దిగజారిపోతోంది. గత ఐదేళ్లు తెలంగాణ ఆర్థిక పరిస్థితి అద్భుత ప్రగతి సాధించింది. దేశంలో టాప్ లో నిలిచింది. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టాక సీన్ రివర్సైంది. రోజురోజుకీ తెలంగాణ రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ పడిపోతోంది.గతేడాదితో పోలిస్తే రూ.1,000 కోట్లకుపైగా ప్రభుత్వ ఆదాయం తగ్గింది. వరుసగా మూడో నెలలోనూ రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ లావాదేవీలు తగ్గుముఖం పట్టాయి.

హైడ్రా వల్లే ఆదాయం పడిపోయిందని రిజిస్ట్రేషన్ల శాఖ చెబుతోంది. హైదరాబాద్ లో హైడ్రా అక్రమ కట్టడాల కూల్చివేతల వల్ల రాజధాని చుట్టుపక్కల ప్రాంతాల్లో భూములు, ఆస్తుల కొనుగోళ్లు మందగించాయని రిజిస్ట్రేషన్ల శాఖ వర్గాలు చెబుతున్నాయి. గతేడాది అక్టోబర్తో పోలిస్తే ఈ ఏడాది అక్టోబర్లో ఏకంగా రూ. 140 కోట్ల ఆదాయం తగ్గిందని స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఇప్పటికే గతేడాదితో పోలిస్తే ఆదాయం విషయంలో రూ.1,000 కోట్లకుపైగా వెనుకబడింది ఉన్న స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ. వరుసగా రిజిస్ట్రేషన్ల కార్యకలాపాలు మందగించడంపై ప్రభుత్వ వర్గాల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. అక్టోబర్ నెలలో పరిస్థితిని చూస్తే రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ రిజిస్ట్రేషన్ కార్యకలాపాలు మందగించాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button