క్రైమ్ మిర్రర్, ఆన్లైన్ డెస్క్: బీఆర్ఎస్ ప్రభుత్వంలోని రైతు బంధు పథకాన్ని రైతు భరోసాగా కాంగ్రెస్ ప్రభుత్వం మార్చింది. వందల ఎకరాలు ఉన్న వారికి కూడా రైతు బంధు ఇవ్వడం పట్ల రైతుల నుంచి పెద్ద ఎత్తున వ్యతిరేకత పవ్యక్తం అవువుతున్నట్లుగా గుర్తించిన కాంగ్రెస్ ప్రభుత్వం. రైతు భరోసా ఎలా అమలు చేయాలని విషయం పైన తాజాగా రైతుల నుంచి అభిప్రాయాలను సేకరించింది. ఈ మేరకు శుక్రవారం కేబినెట్ సబ్ కమిటీ సమావేశం కూడా జరిగింది.
10 ఎకరాలలో రైతులకు రైతు భరోసా వర్తింపజేయాలని రైతుల నుంచి పెద్ద ఎత్తున వచ్చిన విజ్ఞప్తిని చర్చించారు. అలాగే కౌలు రైతులకు కూడా ఇవ్వాలని వచ్చిన విజ్ఞప్తులను కూడా పరిశీలించారు. అయితే కౌలు రైతులను ఎలా గుర్తించాలి అనే దాని పైన కూడా సమగ్రంగా చర్చించారు. మొత్తం మీద ఆగస్టు 15 లోపల సీఎం రేవంత్ రెడ్డి రైతు భరోసాను విడుదల చేసేందుకు తగిన చర్యలు చేపడుతున్నారు. విధి విధానాలను త్వరలోనే ప్రకటించనున్నారు.