తెలంగాణ

హైదరాబాద్ నాలుగు ముక్కలు.. నలుగురు మేయర్లు!

గ్రేటర్ హైదరాబాద్ స్వరూపం పూర్తిగా మారిపోనుందా అంటే రేవంత్ రెడ్డి సర్కార్ తీసుకుంటున్న నిర్ణయాలతో అవుననే తెలుస్తోంది. హైదరాబాద్ గతంలో మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ హైదరాబాద్ ఎంసీహెచ్ గా ఉండేది. అప్పుడు ఎంసీహెచ్ పరిధిలో 100 వార్డులు ఉండేవి. హైదరాబాద్, సికింద్రాబాద్ కోర్ సిటీ పరిధిలోనే MCH కార్యాకలాపాలు జరిగేయి. తర్వాత ఎంసీహెచ్ ను వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ జీహెచ్ఎంసీగా మార్చారు. కోర్ సిటీ పాటు అప్పడి ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని కూకట్ పల్లి, శేరిలింగంపల్లి, ఎల్బీనగర్, రాజేంద్రనగర్ వంటి ప్రాంతాలను కలుపుతూ మొత్తం 150 వార్డులతో జీహెచ్ఎంసీ ఏర్పాటైంది.

జీహెచ్ఎంసీకి 2009లో తొలిసారి ఎన్నికలు జరిగాయి. 2015 డిసెంబర్ లో రెండో సారి.. 2020 చివరలో మూడోసారి ఎన్నికలు జరిగాయి. ప్రస్తుత జీహెచ్ఎంసీ పదవి కాలం 2026 జనవరి వరకు ఉంది. బీఆర్ఎస్ ప్రభుత్వం జీహెచ్ఎంసీ స్వరూపం మార్చనప్పటికి.. శివారు ప్రాంతాల్లో భారీగా కార్పొరేషన్లు, మున్సిపాలిటీలను ఏర్పాటు చేసింది. నిజాంపేట, బడంగ్ పేట, మీర్ పేట, పీర్జాదీగూడ, జవహర్ నగర్ వంటి కార్పొరేషన్లను ఏర్పాటు చేసింది. ఎంసీహెచ్ ఉన్నప్పుడు హైదరాబాద్ అర్బన్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ HUDA ఉండేది. జీహెచ్ఎంసీ ఏర్పాటు కాగానే హుడాను హైదరాబాద్ మెట్రో డెవలప్ మెంట్ అథారిటీ(హెచ్ఎండీఏ)గా మార్చారు.

అయితే జీహెచ్ఎంసీ స్వరూపం మార్చే దిశగా రేవంత్ రెడ్డి సర్కార్ ప్లాన్ చేస్తుందని తెలుస్తోంది. ఇటీవలే హైడ్రాను ఏర్పాటు చేసింది. హైడ్రా పరిధిని ట్రిపుల్ ఆర్ వరకు విస్తరించింది. దీంతో జీహెచ్ఎంసీ పరిధిని విస్తరిస్తారనే వార్తలు వచ్చాయి. అవుటర్ రింగ్ రోడ్డు లోపలి ప్రాంతాన్ని మొత్తం కలిపి అతిపెద్ద కార్పొరేషన్ ఏర్పాటు చేస్తారనే వార్తలు వచ్చాయి. ఆ దిశగా కసరత్తు చేస్తున్నారనే ప్రచారం సాగింది. అయితే జీహెచ్ఎంసీ పరిధి మార్పుపై తాజాగా మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు.ఫిబ్రవరి 2026లో GHMC ఎన్నికలు జరుగుతాయన్నారు. హైదరాబాద్‌ను నాలుగు కార్పొరేషన్‌లుగా విభజిస్తామని ప్రకటించారు. నలుగురు మేయర్‌లు ఉంటారన్నారు.

జీహెచ్ఎంసీ విస్తరణపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి చేసిన ప్రకటన చర్చగా మారింది. హైదరాబాద్ ను నాలుగు ముక్కలు చేస్తే ఏఏ ప్రాంతాన్ని సెపరేట్ చేస్తారనే చర్చలు సాగుతున్నాయి. ఓల్డ్ సిటీకి ఒక మేయర్.. సికింద్రాబాద్ ప్రాంతానికి మరో మేయర్.. కూకట్ పల్లి ,శేరిలింగం పల్లి ప్రాంతాలను కలిపి మూడో మేయర్.. ఎల్బీనగర్, ఉప్పల్, మల్కాజ్ గిరి ప్రాంతాలను కలుపుతూ నాలుగో మేయర్ ఉండేలా కసరత్తు జరుగుతుందంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button