Monday, February 23, 2026
Homeతెలంగాణహైదరాబాద్‌లో స్కూళ్లకు రెండు రోజులు సెలవు

హైదరాబాద్‌లో స్కూళ్లకు రెండు రోజులు సెలవు

క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో : తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. శుక్రవారం రాత్రి మొదలైన వాన ఎడతెరపి లేకుండా కురుస్తూనే ఉంది. హైదరాబాద్ లో కుండపోతగా వర్షం కురుస్తోంది. మరో మూడు రోజులు హైదరాబాద్ లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో భారీ వర్షాల నేపథ్యంలో హైదరాబాద్ లోని విద్యాసంస్థలకు రెండు రోజులు సెలవు ప్రకటించారు. సోమవారం స్కూల్ ఉండదు. సోమవారం తర్వాత మంగళవారం సెలవుపై నిర్ణయం తీసుకోనున్నారు.

రాబోయే రెండు రోజులు భారీ వర్షాలు పడే అవకాశలు ఉన్నందున వాతావరణ శాఖ రెడ్ ఎలర్ట్ ప్రకటించిన నేపథ్యంలో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా పటిష్ట చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు.హైదరాబాద్ జిల్లాలో రెండు రోజుల భారీ వర్షాలు కురుసే అవకాశం ఉన్నందున ఏ విధమైన ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా పటిష్ట చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ను సీఎస్ ఆదేశించారు. వాతావరణ శాఖ రెడ్ ఎలర్ట్ సూచించిన నేపథ్యంలో సోమవారం అన్ని ప్రభుత్వ పాఠశాలలకు సెలవు ప్రకటించారు. గ్రేటర్ పరిధిలో 59 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందని లోతట్టు ప్రాంతాల ప్రజలను ముందుగా తరలించాలని అధికారులను ఆదేశించారు. రెవెన్యూ, ఇరిగేషన్, పోలీస్, విద్యుత్, ఆర్ అండ్ బి శాఖలతో పాటు జిహెచ్ఎంసి అధికారులు కూడా నిరంతరం విధులలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

Read More : బీజేపీ నేత నిర్మాణాలను కూల్చేసిన హైడ్రా

ఏమైనా సమస్యలు ఉన్నట్లయితే హైదరాబాద్ కలెక్టరేట్ లోని కంట్రోల్ నెం. 040-23202813 / 9063423979 నెంబర్ తో పాటు హైదరాబాద్ ఆర్డిఓ హైదరాబాద్ 7416818610 / 9985117660 ,సికింద్రాబాద్ ఫోన్ నెంబర్ 8019747481నెంబర్లకు ఫోన్ చేసి సమస్యలు, ఇబ్బందులను తెలియజేయాలనీ ప్రజలకు కోరారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments