క్రీడలుతెలంగాణ

హైదరాబాదులో కొత్తగా క్రికెట్ స్టేడియం ఏర్పాటు: సీఎం రేవంత్ రెడ్డి

క్రైమ్ మిర్రర్ ఆన్లైన్ డెస్క్:
హైదరాబాదులో మరొక క్రికెట్ స్టేడియం ఏర్పాటు కానుంది. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ప్రకటన చేశారు.హైదరాబాద్ శివారులోని కందుకూరు మండల పరిధిలోని బేగరికంచలో మరో అంతర్జాతీయ స్థాయి క్రికెట్ స్టేడియం నిర్మించున్నట్టు తెలిపారు. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ప్రసంగించిన సీఎం రేవంత్ రెడ్డి. తమ ప్రభుత్వం వ‌చ్చిన‌ప్పటి నుంచి క్రీడలకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. గ‌తంలో ఉమ్మడి రాష్ట్రంలో గ‌చ్చిబౌలి స్టేడియంలో వివిధ ర‌కాల క్రీడ‌లు నిర్వహించామన్నారు. పుల్లెల గోపీచంద్ అకాడ‌మీకి స్థలం ఇచ్చామన్నారు. తద్వారా అకాడ‌మీ నుంచి చాలా మంది క్రీడాకారులు త‌యార‌య్యారని చెప్పుకొచ్చారు. ప్రైవేటు అకాడ‌మీలు కాకుండా ప్రభుత్వం త‌ర‌పున శిక్షణ ఇస్తే అద్భుతంగా రాణించ‌డానికి అవ‌కాశం ఉంటుందని.. అందుకోసమే ఈ బ‌డ్జెట్‌లో ప్రత్యేకంగా క్రీడల కోసం 361 కోట్లు కేటాయించినట్టు రేవంత్ రెడ్డి వివరించారు.

మరోవైపు.. ఉన్నత చ‌దువులు చదివించే క్రమంలో.. పిల్లల‌ను క్రీడ‌ల‌కు దూరం చేస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి. ఆట‌ల్లో కూడా రాణించాలని.. తద్వారా కూడా ఉద్యోగాలు వ‌స్తాయని.. ఉపాధి దొరుకుతుందని.. కుటుంబానికి గౌర‌వం కూడా ల‌భిస్తుందంటూ పేర్కొన్నారు. ఈ విష‌యాన్ని ప్రపంచానికి తెలియ‌జేసేందుకే నిఖ‌త్ జ‌రీన్‌కు, సిరాజ్‌కు ప్రభుత్వ ఉద్యోగాలు ప్రకటించినట్టు రేవంత్ రెడ్డి వెల్లడించారు. కేవలం ఉద్యోగాలే కాదు.. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ ప్రాంతాల్లో 600 గ‌జాల చొప్పున ఇంటి స్థలం కూడా కేటాయించామని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

Back to top button