క్రైమ్ మిర్రర్, సికింద్రాబాద్ : తార్నాక డివిజన్లోని ఆయా ప్రాంతాల్లో నిర్వహించిన బోనాల ఉత్సవాల్లో నగర డిప్యూటీ మేయర్ శ్రీధర్ శోభన్ రెడ్డి పాల్గొన్నారు అనంతరం అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సంస్కృతికి ప్రతీకగా బోనాల పండుగ సంబరాలు, ఆషాడ మాసం లో ప్రతి ఒక్క ఆడపడుచుకు ఎంతో ప్రీతికరమన్నారు. అంతకుముందు డిప్యూటీ మేయర్ హనుమాన్ నగర్ శ్రీ నల్లపోచము దేవాలయం వరకు కాలనీ వాసులతో కలిసి బోనాలు వస్త్రాలు తీసుకొని అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హనుమాన్ నగర్ కాలనీ ప్రెసిడెంట్ మరియు కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.
530 Less than a minute