తెలంగాణ

హైడ్రాకు మరిన్ని పవర్స్… కేటీఆర్ ఫాంహౌజ్ ఖేల్ ఖతం!

క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో : బడాబాబులే టార్గెట్ గా సీఎం రేవంత్ రెడ్డి మరో సంచలన నిర్ణయం తీసుకోబోతున్నారని తెలుస్తోంది. నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన ప్రముఖుల గెస్ట్‌హౌ్‌సలపై చర్యలు తీసుకునేలా హైడ్రా పరిధిని విస్తరించే ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం చెరువుల ఎఫ్‌టీఎల్‌, బఫర్‌ జోన్లు, పార్కుల్లో నిర్మాణాలను నేలమట్టం చేస్తోంది హైడ్రా. ప్రస్తుతం విదివిధానాల ప్రకారం ప్రస్తుతం అతిథి గృహాలపై చర్యలకు హైడ్రాకు అవకాశం లేదు. జన్వాడ ఫాంహౌజ్ విషయంలో కోర్టులో ఈ వాదనే వచ్చింది. ఈ సమయంలోనే హైడ్రా పరిధులను ధర్మాసనం ప్రశ్నించింది. దీంతో జీవో 111 పరిధిలోని ప్రాంతాలను హైడ్రా కిందకు తీసుకొచ్చేలా సీఎం రేవంత్ రెడ్డి సమాలోచనలు చేస్తున్నారని సమచారం. ప్రజల నుంచి వస్తున్న డిమాండ్ల నేపథ్యంలో హైడ్రా అధికారాల పరిధిని పెంచుతారని తెలుస్తోంది. అదే జరిగితే జీవో 111 పరిధిలోని బడాబాబుల గెస్ట్ హౌజ్ లు నేలమట్టం చేయడం ఖాయమంటున్నారు. కేటీఆర్ దిగా చెబుతున్న జన్వాడ ఫాంహౌజ్ టార్గెట్ గానే ఈ నిర్ణయం తీసుకున్నారనే టాక్ వస్తోంది.

హైడ్రా ఏర్పాటుకు కసరత్తు జరుగుతున్న సమయంలోనే జీవో 111 ప్రాంతాలను సంస్థ పరిధిలోకి తీసుకొచ్చే అంశం ప్రస్తావనకు వచ్చినట్టు తెలుస్తోంది. చెరువులు, పార్కులు, ప్రభుత్వ స్థలా ల పరిరక్షణ ప్రధాన లక్ష్యంగా తొలుత సంస్థ ఏర్పా టు చేయాలని.. పనితీరు, స్పందనను బట్టి తదుపరి నిర్ణయాలు తీసుకోవాలని ప్రభుత్వ పెద్దలు సూచించినట్లు సమాచారం. హైడ్రా చర్యలపై దేశవ్యాప్తంగా ప్రశంసలు వస్తున్నాయి. రిటైర్డ్‌ ఐఏఎస్ లు, ఉన్నతాధికారులు ఆరా తీస్తున్నారు. ఢిల్లీ, ఏపీ ప్రజల నుంచి హైడ్రా వంటి సంస్థ ఏర్పాటుకు డిమాండ్లు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఏజెన్సీకి మరిన్ని హక్కులు కల్పిస్తూ పర్యావరణ పరిరక్షణ దిశగా చర్యలు తీసుకోవాలని రేవంత్ సర్కారు భావిస్తోంది. ట్లు సమాచారం. త్వరలో ఓఆర్‌ఆర్‌ వెలుపలి ప్రాంతా లు కూడా హైడ్రా పరిధిలోకి వస్తాయని అధికారులు చెబుతున్నారు. నార్సింగ్‌, బండ్లగూడ, శంషాబాద్‌, తుక్కుగూడ, ఆదిభట్ల, దుండిగల్‌ మునిసిపాలిటీల్లోని పలు గ్రామాలు ఔటర్‌ వెలుపల ఉన్నాయి. ఆ ప్రాంతాల్లోనూ హైడ్రా చర్యలు తీసుకోనుంది.

Back to top button