క్రైమ్ మిర్రర్, సంగారెడ్డి జిల్లా ప్రతినిధి : అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని చక్రపురి కాలనీలో సర్వే నంబర్‌లు126,127, 128,129,130,135,136,137,152&152 హూడ లే అవుట్ పార్కు స్థలంలో అక్రమంగా 4 ఇండ్ల నిర్మాణాలు చేపట్టారన్ని ఈ అక్రమ నిర్మాణాన్ని వెంటనే ఆపాలని కాంగ్రెస్ పార్టీ సంగారెడ్డి జిల్లా జనరల్ సెక్రెటరీ చిన్న ముదిరాజ్ (బాల మురళీ కృష్ణ) సోమవారం నాడు ప్రజావాణిలో జిల్లా కలెక్టర్ కి ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ, అమీన్పూర్ మున్సిపల్ కార్యాలయంలోని టౌన్‌ప్లానింగ్ విభాగానికి ఇదే విషయంపై గతంలో రెండు సార్లు ఫిర్యాదు చేశాం. అక్కడ మున్సిపల్ కమిషనర్ ఫిర్యాదును పరిష్కరించిన పాపాన పోలేదు. అందువల్ల జిల్లా కలెక్టర్ కి చక్రపురి కాలనీలో జరుగుతున్న అక్రమాలను దృష్టికి తీసుకురావడం జరిగిందన్నారు. ఇట్టి కబ్జాదారులపై వెంటనే చర్యలు జరిపేలా అప్రూవల్ లేఔట్ లోని పార్క్ స్థలాన్ని పరిశీలించి పార్కులోకి చొరబడి కడుతున్న నాలుగు ఇండ్లను కూల్చివేసి అక్రమంగా కట్టడాలు చేపట్టిన వారిపై చర్యలు తగు తీసుకోవాలని వినతిపత్రం అందజేయడం జరిగిందన్నారు.
ఇవి కూడా చదవండి :
- ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు పొందిన రామప్పలో వరల్డ్ హెరిటేజ్ వాక్…
- అన్నదాతలకు ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తాం.. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
- రైతు రుణమాఫీకీ మార్గదర్శకాల జారీ.. అదే ప్రామాణికం!!!
- కేఎస్‌ఆర్టీసీ బాటలో టీజీఎస్‌ఆర్టీసీ.. బస్సు ఛార్జీల పెంపుపై కేటీఆర్ ట్వీట్!!
- రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం.. నేటి నుండి ఆన్‌లైన్‌లో సీఎంఆర్ఎఫ్ దరఖాస్తులు!!!