జాతీయం

హర్యానాలో కాంగ్రెస్ ప్రభంజనం.. కశ్మీర్ కూడా కాంగ్రెస్ కూటమిదే!

రెండు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీకి బిగ్ షాక్ తగిలింది. రెండు రాష్ట్రాల్లోనూ కమలం పార్టీ కుదేలైంది. జమ్ము కశ్మీర్‌ ,హరియాణా అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపులో తొలి ట్రెండ్స్ కాషాయ పార్టీకి వ్యతిరేకంగా వస్తున్నాయి. జమ్ముకశ్మీర్‌ లో ఆర్టికల్‌ 370 రద్దు, రాష్ట్ర హోదా తొలగించిన తర్వాత నిర్వహించిన ఎన్నికలు కావడం వల్ల దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. మొత్తం 90 స్థానాలకు గానూ మూడు విడతల్లో ఎన్నికలు జరిగాయి. ప్రధాన రాజకీయ పార్టీలన్నీ తమ పార్టీనే అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశాయి. ఇండియా కూటమిలోని కాంగ్రెస్‌, నేషనల్‌ కాన్ఫరెన్స్‌ పార్టీలు ఎన్నికల్లో పొత్తు పెట్టుకోగా, బీజేపీ, పీడీపీ ఒంటరిగా బరిలోకి దిగింది.

ఎగ్జిట్ పోల్స్ హంగ్ ప్రభుత్వమే వస్తుందని అంచనా వేశాయి. ఎగ్జిట్ పోల్స్ అంచనాలే నిజమవుతున్నాయి. తొలి ట్రెండ్స్ లో హంగ్ సూచనలే కనిపిస్తున్నా.. కాంగెస్, ఎన్సీ కూటమికి మెజార్టీ సీట్లలో లీడ్ లో ఉంది. బీజేపీ చాలా వెనకబడి ఉంది. పీడీపీ సింగిల్ డిజిట్ పై పరిమితమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. అయితే ఐదుగురు ఎమ్మెల్యేలను లెఫ్టినెంట్ గవర్నర్ నామినేట్ అంశం కీలకంగా మారే అవకాశం ఉంది. దీనిపై సుప్రీం కోర్టుకు వెళ్తామని కాంగ్రెస్ ఎన్​సీ, పీడీపీ పార్టీలు స్పష్టం చేశాయి. తొలి ఫలితాలపై స్పందించిన నేషనల్ కాన్పరెన్స్ చీఫ్ ఒమర్ అబ్దుల్లా తమకు పూర్తి మెజార్టీ వస్తుందనే ధీమా వ్యక్తం చేశారు. ఎల్జీ ప్రజాస్వామాన్ని పరిరక్షించాలని కోరారు.

ఇక 90 స్థానాలున్న హరియాణాలోనూ కాంగ్రెస్ కు క్లియర్ మెజార్టీ వచ్చే సూచనలు కన్పిస్తున్నాయి. ఇక్కడ బీజేపీ కాంగ్రెస్‌లు అధికారం కోసం పోటీపడుతున్నాయి. హరియాణా లో హ్యాట్రిక్‌ విజయం తమదేనని బీజేపీ ధీమా వ్యక్తం చేస్తుండగా ఈసారి మార్పు ఖాయమని కాంగ్రెస్‌ పూర్తి నమ్మకంతో ఉంది. హరియాణా హస్తం పార్టీదేనని ఎగ్జిట్‌ పోల్స్‌ కూడా అంచనా వేశాయి. అందుకు అనుగుణంగా తొలి ఫలితాలు వస్తున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button