కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అక్రమాలపై కమిషన్ విచారణ ముమ్మరంగా సాగుతోంది. రోజుకు కొందరు అధికారులను కమిషన్ ప్రశ్నిస్తోంది. తెలంగాణ మాజీ సీఎస్ సోమేష్ కుమార్, సీఎంవో మాజీ అధికారిని స్మితా సబర్వాల్ విచారణకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఇద్దరిపై జస్టిస్ పినాకి చంద్రఘోష్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
కాళేశ్వరం కమిషన్ బహిరంగ విచారణ సమయంలో ఆలస్యంగా లోపలికి వచ్చారు సోమేశ్ కుమార్. దీంతో ఆయనపై కమిషన్ ఆగ్రహం వ్యక్తం తేసింది. ఆయన సమాధానాలిచ్చిన తీరుపైనా కమిషన్ చైర్మన్ జస్టిస్ పీసీ ఘోష్ అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. కమిషన్ ముందర చాలా సమాధానాలకు ‘గుర్తు లేదు’ అనే మాజీ సీఎస్ సమాధానం ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ప్రశ్నలకు సూటిగా సమాధానం ఇవ్వాలని జస్టిస్ పీసీ ఘోష్ ఆదేశించారు. “మీరేం డిబేట్కు రాలేదు.. స్ట్రయిట్గా ఆనర్సివ్వండి” అని చెప్పారాయన.
అదే సమయంలో విచారణకు హాజరైన మరో ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్ సైతం ఇదే రీతిలో పొడిపొడిగా సమాధానం ఇచ్చారు. దీంతో.. సూటిగా సమాధానాలివ్వని ఈ ఇద్దరిపైనా పీసీ ఘోష్ ఆగ్రహం వ్యక్తం చేశారు