హైదరాబాద్ లోని నాచారంలో తీవ్ర విషాదం జరిగింది. స్థానికులను కన్నీళ్లు పెట్టించింది. తన కూతురిని స్కూల్ దగ్గర దించి వస్తున్న తల్లి రోడ్డు ప్రమాదంలో చనిపోయింది. ఆమె వస్తున్న స్కూటీని గ్యాస్ సిలిండర్ లారీ గుద్దడంతో స్పాట్ లోనే చనిపోయింది.
నాచారంలో ఉంటున్న నీతా తన కూతురిని స్కూల్ కు రెడీ చేసింది. అయితే అప్పటికే స్కూల్ బస్సు వెళ్లిపోయింది. తన కూతురు కోసం స్కూల్ బస్సు ఆగకుండా వెళ్లిపోనడంతో ఆమె తన న కూతురును స్కూటీపై స్కూల్ కు తీసుకెళ్లింది. జాన్సన్ గ్రామర్ స్కూల్ దగ్గర వదిలి తిరిగి వస్తుంటే ప్రమాదానికి గురైంది.
కూతురును స్కూల్ దగ్గర వదిలి తల్లి నీతా వస్తుండగా నాచారం హెచ్ఎంటి గేటు వద్ద గ్యాస్ సిలిండర్ లోడ్తో వెళ్తున్న లారీ చక్రాల కింద పడి మృతి చెందింది.ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదం నింపింది.ఒక్క నిమిషం స్కూల్ బస్సు ఆగి ఉంటే ఆ తల్లి ప్రాణాలతో ఉండేదని స్థానికులు, బంధువులు రోధిస్తున్నారు.