తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. గ్రామాల్లో కాంగ్రెస్ నేతలను జనాలు ఎక్కడికక్కడ నిలదీస్తున్నారు.గ్రామాలలో కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అబద్ధపు ప్రచారాలను తరిమి కొడుతున్నారు ప్రజలు. సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లాలోనే కాంగ్రెస్ పార్టీకి ఘోర పరాభవం ఎదురైంది.
మహబూబ్ నగర్ జిల్లా అడ్డాకుల మండల కేంద్రంలోని బస్టాండ్ వద్ద ప్రజా పాలన విజయోత్సవాల వాహనాన్ని అడ్డుకున్నారు జనం.ప్రజా పాలన ప్రజా విజయోత్సవాల ప్రచారం కోసం కళా యాత్ర పేరుతో ప్రచార వాహనాలు ఏర్పాటు చేసింది ప్రభుత్వం. ఇచ్చిన అన్ని హామీలను అమలు చేశామంటూ కళాకారులు పాటలు పాడుతున్నారు. దీంతో అక్కడికి వచ్చిన గ్రామస్తులు కళాకారులను, స్థానిక కాంగ్రెస్ నేతలను నిలదీశారు. ఆరు గ్యారెంటీల అమలు పై కళాకారుల ప్రదర్శన పై మండిపడ్డారు జనం. ఏ హామీలు అమలు చేసారని ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు మహిళలు, వృద్ధులు.
నెలకు 2500 రూపాయలు ఇస్తామని చెప్పారు.. ఇస్తున్నారా అని మహిళలు ప్రశ్నించారు. నాలుగు వేల రూపాయల పెన్షన్ ఏమైందని వృద్దులు నిలదీశారు. తులం బంగారం ఏమైందంటూ ప్రశ్నల వర్షం కురించారు. రుణమాఫీ కాని రైతులు కళాకారులపై దూసుకుపోయారు. రైతు బంధు ఎప్పుడుస్తారంటూ అన్నదాతలు ఆగ్రహం వ్యకం చేశారు. గ్రామస్తుల తిరుగుబాటుతో చేసేది లేక వాహనాన్ని తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోయారు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కళాకారులు.