తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సొంత పార్టీ నేతలు షాక్ ఇస్తున్నారు. ఏడాది పాలన సంబరాలకు రేవంత్ సర్కార్ రెడీ అవుతుండగా నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి గైర్హాజరయ్యారు. హన్మకొండలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్న ప్రజాపాలన విజయోత్సవ సభ మాధవరెడ్డి నివాసానికి దగ్గరలోనే జరిగింది. అయితే సీఎం రేవంత్ రెడ్డి సభకు ఎమ్మెల్యే దొంతి మాదవరెడ్డి డుమ్మా కొట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన సభకు ఎమ్మెల్యే దొంతి హాజురుకాకపోవడం గాంధీభవన్ లో కలకలం రేపుతోంది.
గత కొంతకాలంగా పార్టీ నేతలు నగరానికి వచ్చినప్పుడు ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి దూరంగా ఉన్నారు. గతంలో కూడా రేవంత్ రెడ్డి వరంగల్ పర్యటనలకు దూరంగా ఉన్నారు. అంతేకాదు మొన్న పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ జిల్లాకు వచ్చినా కలవలేదు. దీంతో ఆయన తీరుపై కాంగ్రెస్ శ్రేణులు అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది.