సంధ్య థియేటర్ లో జరిగిన తొక్కిసలాటకు అల్లు అర్జునే కారణమన్న సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు స్ట్రాంగ్ కౌంటరిచ్చారు పుష్ప. సీఎం రేవంత్ రెడ్డి చెప్పినవన్ని అబద్దాలే అన్నారు. థియేటర్ తొక్కిసలాట ఘటన చాలా దురదృష్టకరమని.. ఇది ఒక యాక్సిడెంట్ అన్నారు. ఇందులో ఎవరిది తప్పులేదు.. అంతా మంచి జరగాలనుకున్నా అనుకోని ప్రమాదం జరిగిందని చెప్పారు. సినిమాకు వచ్చేవారిని ఎంటర్‌టైన్ చేయాలనుకుంటాను.. శ్రీతేజ్ ఆరోగ్యం ఎలా ఉందో ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నా అన్నారు. శ్రీతేజ్ ఆరోగ్యం మెరుగుపడుతోంది..శ్రీతేజ్ కోలుకోవాలని కోరుకుంటున్నా.. నేను ఎవరిని దూషించదలుచుకోలేదని పుష్ప క్లారిటీ ఇచ్చారు.
20 ఏళ్లుగా నన్ను చూస్తున్నారు కదా.. నేను ఎవరినైనా ఏమైనా అంటానా అని అల్లు అర్జున్ అన్నారు.తనపై చేస్తున్న తప్పుడు ఆరోపణలు బాధ కలిగిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. మూడేళ్లు కష్టపడ్డ సినిమా ఎలా ఉందో చూద్దామని థియేటర్‌కు వెళ్లానని..తాను పోలీసుల డైరెక్షన్‌లోనే వెళ్లానని.. పోలీసులే తన కారుకు ట్రాఫిక్ క్లియర్ చేశారని అల్లు అర్జున్ వెల్లడించారు. తాను ఎలాంటి రోడ్‌షో, ఊరేగింపు చేయలేదన్నారు. అంత మంది అభిమానులు ప్రేమ చూపిస్తున్నప్పుడు కారులో కూర్చుంటే గర్వం ఉందని అనుకుంటారని.. అందుకే కారు బయటికి వచ్చి అభివాదం చేస్తూ ముందుకు వెళ్లానన్నారు.
థియేటర్‌లో తనను ఏ పోలీస్ నన్ను కలవలేదని.. మా వాళ్లు చెబితేనే తాను వెళ్లిపోయానని చెప్పారు. రేవతి చనిపోయిందని తర్వాతి రోజే తనకు తెలిసింద్ననారు. తరవాతి రోజు హాస్పటల్‌కు వెళ్దామంటే రావద్దని చెప్పారన్నారు. హాస్పిటల్ కు వెళ్లి చూద్దామనుకున్నా తనకు అనుమతి ఇవ్వడం లేదన్నారు. తన పట్ల తప్పుడు ఆరోపణలు, అవాస్తవాలు ప్రచారం జరుగుతున్నాయని ఉద్వేగానికి గురయ్యారు అల్లు అర్జున్. తన వ్యక్తితత్వాన్ని హననం చేసేలా ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ఆ రోజు నుంచి తాను ఎక్కడికి వెళ్లలేకపోతున్నానని.. 15 రోజులుగా ఇంట్లో కూర్చొని బాధపడుతున్నానని చెప్పారు.నేను కష్టపడిందే ప్రేక్షకుల కోసం.. నేను కాళ్లు చేతులు విరిగితే ఫర్వాలేదన్నానని అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని కన్నీళ్లు పెట్టుకున్నారు పుష్ప.