మాదిగల మహాసభలు,నిరసనలు, రథయాత్ర, బల ప్రదర్శనతో సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీకి కంటిమీద కునుకు లేకుండా చేస్తామని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ హెచ్చరించారు. కాంగ్రెస్ అధిష్టానానికి గాని, తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి సర్కార్కు గాని ఎస్సీ వర్గీకరణ విషయంలో చిత్తశుద్ధి లేదని విమర్శించారు.
గతంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు కేంద్రంలో గాని, ఇటు రాష్ట్రంలో గాని వేసిన కమిషన్లు వాటి సిఫార్సులు ఎక్కడికి పోయాయని మందకృష్ణ ప్రశ్నించారు.కాంగ్రెస్ ప్రభుత్వం కమిషన్లు వేస్తుంది కానీ కమిషన్ల సిఫార్సులు మాత్రం అమలు చేయదన్నారు.వర్గీకరణ చేపడితేరేవంత్ రెడ్డి తమ ప్రయోజనాలు పోల్పోతామన్న భయంలో రేవంత్ ఉన్నారన్నారు. మాదిగలు వర్గీకరణ కోసం పోరాడాలి, మాలలు వర్గీకరణను అడ్డుకోవాలి అనే అంశంతో రేవంత్ రెడ్డి సన సొంత స్వప్రయోజనాలను కాపాడుకునే కుట్ర కోణం దాగుందన్నారు మందకృష్ణ.
ఎస్సీ వర్గీకరణ చేపడితే మాదిగ మాలలు అందరూ కలిసి మళ్లీ ఒకసారి తమ ఉమ్మడి ప్రయోజనాల కోసం ఉద్యమిస్తారని భయం రేవంత్ రెడ్డి సర్కార్లో ఉందన్నారు మందకృష్ణ మాదిగ. రేవంత్ రెడ్డి హామీలు ఇవ్వడంలో ఎంత దిట్టో ఆ హామీలను అమలు చేయకుండా మోసం చేయడంలో కూడా అంతకన్నా అందవేసిన చేయి అని విమర్శించారు. కేంద్రంలో,రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్న పెద్దలు, ఇక్కడ ఉన్న డబ్బు గల కొంతమంది నాయకులు,టీవీ చానల్స్ తమ డబ్బు అధికారాన్ని ఉపయోగించి వర్గీకరణ జరిగితే తమ ఉనికిని అధికారాన్ని కోల్పోతామన్న భయంతో వర్గీకరణ అంశాన్ని అడ్డుకుంటున్నారని ఆరోపించారు.
నవంబర్ నెలలో మొదట మహాసభలు, తరువాత నిరసనలు, రథయాత్రతో 21తేదీ హైదరాబాద్ కేంద్రంగా మాదిగల మహాబల ప్రదర్శనను చేపడతామని మందకృష్ణ మాదిగ ప్రకటించారు. మాదిగల బల ప్రదర్శన ఏ రూపం తీసుకుంటుందో దానికి రేవంత్ రెడ్డి సర్కారు మాత్రమే బాధ్యత వహించాలని హెచ్చరించారు .