జాతీయంతెలంగాణ

సిద్దరామయ్య సీఎం పదవి ఊస్ట్.. నెక్స్ట్ టార్గెట్ రేవంతేనా?

కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు భారీ షాక్ తగిలింది. ముడా స్కాం కేసులో గవర్నర్ నిర్ణయాన్ని హైకోర్టు సమర్థించింది. మైసూరు నగరాభివృద్ధి సంస్థ స్థలాల కేటాయింపుల కుంభకోణంలో సిద్ధరామయ్యను విచారించేందుకు రాష్ట్ర గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్ ఆదేశాలు జారీ చేశారు. దీనిపై హైకోర్టుకు వెళ్లారు సిద్దరామయ్య. హైకోర్టు ఆదేశాలతో ముడా స్కాంలో సిద్ధరామయ్యపై విచారణ జరగనుంది.

ప్రదీప్ కుమార్, అబ్రహాం, స్నేహమయి కృష్ణ అనే ముగ్గురు యాక్టివిస్టులు దాఖలు చేసిన పిటిషన్ల నేపథ్యంలో సీఎంను ప్రాసిక్యూట్ చేయాలని గవర్నర్ ఆదేశించారు. గవర్నర్ ఆదేశాల మేరకు.. ముఖ్యమంత్రి సిద్ధరామయ్యపై అవినీతి నిరోధక చట్టం 1988, భారతీయ నాగరిక సురక్ష సంహిత 2023 కింద… ఆయనపై వచ్చిన అవినీతి ఆరోపణలపై విచారణకు ఆదేశిస్తున్నట్టు గవర్నర్ సెక్రటేరియట్ లేఖను విడుదల చేసింది.

Read More : బిడ్డా రేవంత్..పేదలే తరిమికొడతరు!రెచ్చిపోయిన ఈటల

హైకోర్టు తీర్పుపై సిద్దరామయ్య ముఖ్యమంత్రి పదవికి గండం వచ్చి పడింది. ఆయన రాజీనామా చేయాలనే డిమాండ్ వస్తోంది. మైసూరు నగరాభివృద్ధి సంస్థ స్థలాల కేటాయింపుల సిద్దరామయ్య భార్య పార్వతి పేరుతో కేటాయింపులు జరగడం ఈ వివాదానికి కారణమైంది. ముఖ్యమంత్రి హోదాలో తన కుటుంబ సభ్యులకు కేటాయింపులు జరపడం తీవ్రమైన విషయం. రాజ్యాంగ విరుద్దం. ఈ కేసు తీవ్రతను బట్టి సిద్దరామయ్య పదవి నుంచి తప్పుకోవాల్సి వస్తుందనే టాక్ వస్తోంది. సిద్దరామయ్యను తప్పించాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది. అటు కాంగ్రెస్ లోకి డీకే శివకుమార్ వర్గం కూడా సిద్దరామయ్య రాజీనామా కోరుతున్నట్లు తెలుస్తోంది.

Read More : అనుముల తిరుపతి రెడ్డి గారు.. మీరు చాలా గ్రేట్.. కేటీఆర్ సంచలన ట్వీట్

సిద్దరామయ్యను తప్పించి డీకే శివకుమార్ కు ముఖ్యమంత్రి పగ్గాలు ఇవ్వాలనే యోచనలో హైకమాండ్ కూడా ఉందంటున్నారు. అదే జరిగితే కర్ణాటకలో కాంగ్రెస్ లో సంక్షోభం తప్పకపోవచ్చనే వార్తలు వస్తున్నాయి. తనను సీఎం పోస్టు నుంచి తప్పిస్తే సిద్దరామయ్య కూడా తన దారి తాను చూసుకునే యోచనలో ఉన్నారంటున్నారు. మొత్తంగా ముడా స్కాంతో కాంగ్రెస్ తీవ్ర ఇబ్బందుల్లో పడిందని అంటున్నారు. కర్ణాటక పరిణామాలు తెలంగాణపైనా ప్రభావం చూపిస్తాయని అంటున్నారు.

Back to top button