జాతీయం

సల్మాన్ ఖాన్‌ను చంపేస్తానని బిష్ణోయ్ గ్యాంగ్ వార్నింగ్.. అసలు కారణం ఇదే!

బాలీవుడ్ టాప్ స్టార్ సల్మాన్ ఖాన్‌ను టార్గెట్ చేసింది బిష్ణోయ్ గ్యాంగ్. చంపేస్తానని బెదిరించింది. ఇటీవలే సల్మాన్ ఖాన్ సన్నిహితుడు, ఎన్సీపీ నేత, మహారాష్ట్ర మాజీ మంత్రి బాబా సిద్ధిఖీ దారుణ హత్యకు గురయ్యాడు. నెక్స్ట్ టార్గెట్ సల్మాన్ ఖానే అనే ప్రచారం సాగుతోంది. దీంతో సల్మాన్ ఖాన్ కు సెక్యూరిటీ పెంచారు పోలీసులు. ఆయన నివాసం దగ్గర భారీగా పోలీసులను మోహరించారు. మరోవైపు సల్మాన్ ఖాన్ ను బిష్ణోయ్ గ్యాంగ్ ఎందుకు టార్గెట్ చేసింది.. వీళ్ల వైరానికి కారణం ఏంటన్న దానిపై రకరకాల చర్చలు సాగుతున్నాయి.

సల్మాన్ ఖాన్ పై 26 ఏళ్లుగా కోపం పెంచుకుందంట బిష్ణోయ్ గ్యాంగ్. ఇందుకు కారణం కృష్ణ జింకలట. అవును ఇదే నిజం.రెండు కృష్ణ జింకలను చంపారని సల్మాన్ ఖాన్ ను పగబట్టిందట బిష్ణోయ్ గ్యాంగ్. బాబా సిద్దిఖి హత్యతో ఈ గ్యాంగ్ పేరు మళ్లీ తెరపైకి వచ్చింది.

బిష్ణోయిలు ప్రధానంగా ప్రకృతితో కలిసిపోయి జీవనం సాగిస్తుం టారు. జంతువులు, వన్యప్రాణులు, వృక్షాలపై ప్రేమ చూపిస్తుంటారు. ముఖ్యంగా కృష్ణజింకలంటే వాళ్ల ప్రాణం. బిష్ణోయిలకు-కృష్ణజింకల మధ్య 550 ఏళ్లనాటి బంధం ఉందని చెబుతున్నారు. గురు జంభేశ్వర్.. జంబాజీ అనే గురువు బిష్ణోయ్ కమ్యూనిటీని ఏర్పాటు చేశారు. వన్య ప్రాణులు, వృక్ష సంపద సంరక్షణే ఆయన ప్రధాన ధ్యేయం. జంబాజీ చెప్పినట్లు బిష్ణోయిలు నడుచుకునేవారు. కృష్ణజింకల్ని బిష్ణోయిలు తమ ఆధ్యాత్మిక గురువు జంభేశ్వరుడి పునర్జన్మగా భావిస్తారు. తమ ఇంటికి వచ్చే కృష్ణజింకలను బిష్ణోయి మహిళలు సొంత పిల్లల్లాగే పెంచుతారు. మరణించిన తర్వాత తాము కృష్ణజింకలుగా పుడుతామనేది వాళ్ల నమ్మకం.

1998లో ‘హమ్ సాథ్ సాథ్ హై’ సినిమా షూటింగ్ జోధ్ పూర్ లో తీశారు. ఈ సమయంలో రెండు కృష్ణ జింకల్ని హీరో సల్మాన్ ఖాన్ వేటాడి చంపేశాడు. అప్పటి నుంచి బిష్ణోయ్ తెగకు సల్మాన్ ఖాన్కి మధ్య యుద్ధమే నడుస్తున్నది. ఈ ఘటన జరిగిన సమయంలో 5 ఏళ్ల వయసున్న లారెన్స్ బిష్ణోయ్.. ఇప్పుడు ఏకంగా గ్యాంగ్ స్టర్ గా మారి సల్మాన్ ఖాన్ని చంపేస్తానని హెచ్చరించారు. సిద్ధిఖీ హత్యతో సల్మాన్ ఖాను బెదిరింపులు పెరగడం, కృష్ణజింకలను చంపడం చుట్టూ ఉన్న వైరమే కారణమని తెలుస్తోంది. కృష్ణజింకలను అత్యంత గౌరవంగా చూసుకునే బిష్ణోయి వర్గం వారు సల్మాన్ ఖాన్ చేసిన పనికి రగిలిపోతుందని.. ప్రతికారం కోసం చూస్తుందని అంటున్నారు. తాజా పరిణామాలతో సల్మాన్ ఖాన్ కు టైట్ సెక్యూరిటీ కల్ిపంచారు ముంబై పోలీసులు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button