తెలంగాణ ప్రభుత్వం గృహ అవసరాల వినియోగదారులకు షాకిచ్చింది. కరెంట్ బిల్లుల మోత మోగించారు విద్యుత్ శాఖ అధికారులు. 800 యూనిట్లు పైబడిన వారికి ఫిక్స్‌డ్ చార్జీలు 10 రూపాయల నుంచి ఏకంగా 50 రూపాయలకు పెంచారు. దుకాణదారులకు 50 యూనిట్ల వరకు 30 రూపాయలు తగ్గించారు. 300 పైబడి యూనిట్లు వాడిన వినియోగదారులకు 70 నుండి 100 రూపాయలను పెంచారు. అడ్వర్‌టైజింగ్ హోల్డింగ్స్ వారికి 70 నుండి 150 రూపాయలకి పెంచారు. చిన్న ఇండస్ట్రియల్ వారికి 75 నుంచి 100 రూపాయలకు పెంచారు. పూర్తిస్థాయిలో ఇంటి వాడకం వారికి మినిమం చార్జెస్ తొలగించారు. నాన్ స్లాబ్ వినియోగదారులకు 25 రూపాయల ఫిక్స్‌డ్ చార్జీల పెంచారు.
0 530 Less than a minute