తెలంగాణ

వర్షాలతో ఆస్తి, ప్రాణ నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలి.. కలెక్టర్ సంచిత్ గంగ్వార్

క్రైమ్ మిర్రర్, వనపర్తి ప్రతినిధి : జిల్లాలో ఎడతెరపి లేని వర్షాలు కురుస్తున్నందున ఆస్తి ,ప్రాణ నష్టం జరగకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని జిల్లా ఇన్చార్జి కలెక్టర్ సంచిత్ గంగ్వార్ అధికారులను ఆదేశించారు. సోమవారం ఉదయం ప్రజావాణి హాల్ నుండి జిల్లా అధికారులతో పాటు వెబ్ ఎక్స్ ద్వారా తహశీల్దార్లు, మండల అభివృద్ధి అధికారులు , మున్సిపల్ కమిషనర్లతో ఎడతెరపి లేని వర్షాలు, గ్రామాలు, మున్సిపాలిటీల్లో పరిస్థితుల పై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఎడతెరపి లేని వర్షాలు కురిస్తున్నాయని, రానున్న రెండు మూడు రోజులు సైతం వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ సూచించినందున ఎక్కడ ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరుగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు.

Read Also : కేఎస్‌ఆర్టీసీ బాటలో టీజీఎస్‌ఆర్టీసీ.. బస్సు ఛార్జీల పెంపుపై కేటీఆర్ ట్వీట్!!

గ్రామాల్లో, మున్సిపాలిటీల్లో పాతబడిన మిద్దెలు ఉండి శిధిలావస్థకు చేరుకొని ఉంటే ఎలాంటి వాటిని గుర్తించి వెంటనే అందులో నుంచి కుటుంబాలను ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులకు తెలిపారు. మురుగు కాలువలు అన్ని శుభ్రం చేయించాలని ఎక్కడ కాలువలు నిండిపోయి ఓవర్ ఫ్లో కాకుండా చూసుకోవాలన్నారు. లోతట్టు ప్రాంతాల్లో నీటి నిలువ లేకుండా చూసుకోవాలని, ఈగలు, దోమలు వ్యాప్తి చెంది అంటురోగాలు ప్రబలే ప్రమాదం ఉంటుంది కాబట్టి పారిశుధ్యం పై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. ఎక్కడైనా పంట నష్టం జరిగితే వెంటనే నివేదిక సిద్ధం చేసి పంపించాలని వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు. విద్యుత్ సమస్య లేకుండా చూసుకోవాలని, పాతబడి కుంగిపోయిన విద్యుత్ స్తంభాలు ఉంటే వెంటనే మార్చాలని, వైర్లు కిందికి వేలాడకుండ కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని విద్యుత్ శాఖ అధికారులను ఆదేశించారు. ఎక్కడైనా పెద్ద సమస్య ఉత్పన్నం అయితే వెంటనే తనకు సమాచారం ఇవ్వాలని సూచించారు. అదనపు కలెక్టర్ రెవెన్యూ యం. నగేష్, జిల్లా అధికారులు, వెబ్ ఎక్స్ ద్వారా తహశీల్దార్లు, ఎంపిడిఓ లు, మున్సిపల్ కమిషనర్లు తదితరులు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి : 

  1. రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం.. నేటి నుండి ఆన్‌లైన్‌లో సీఎంఆర్ఎఫ్ దరఖాస్తులు!!!
  2. యదాద్రిలో ప్రారంభమైన వన మహోత్సవం, గిరిప్రదక్షిణ…
  3. రోడ్డుపై వింత చేపలు.. చూసేందుకు ఎగబడిన జనం!!
  4. అర్థరాత్రి బిజెపి నాయకుల అక్రమ అరెస్టు…
  5. గౌడన్నతో రేవంతన్న… కాటమయ్య కిట్ల పంపిణీ

Related Articles

Back to top button