Tuesday, February 24, 2026
Homeతెలంగాణవరదల్లో ఆగని హైడ్రో.. అక్రమ కట్టడాలు నేలమట్టం

వరదల్లో ఆగని హైడ్రో.. అక్రమ కట్టడాలు నేలమట్టం

భారీ వర్షాలు, వరదలు ఉన్నా హైడ్రా వెనక్కి తగ్గడం లేదు. అక్రమ కట్టడాలపై కొరడా ఝళిపిస్తూనే ఉంది. గ్రేటర్ హైదరాబాద్ తోపాటు చుట్టు పక్కల ఉన్న గ్రామాల్లో కూడా కొరడా ఝుళిపిస్తోంది హైడ్రా. సంగారెడ్డి జిల్లా అమీన్ పూర్ మండలంలోని పలు అక్రమ కట్టాలను కూల్చివేశారు హైడ్రా అధికారులు. అమీన్ పూర్ తహశీల్దార్ రాధా, హైడ్రా అధికారులు దగ్గరుండి కూల్చివేయించారు. ఐలాపూర్ తండా గ్రామ పంచయతీ సర్వే నెంబర్ 119, 121లో అక్రమ వెంచర్ ఏర్పాటు చేసి నిర్మాణాలు చేశారు. హైడ్రా ఆదేశాలతో రెవిన్యూ అధికారులు వెంచర్ అక్రమ కట్టడాలను కూల్చివేశారు.

అమీన్ పూర్ మున్సిపల్ పరిధిలోని సర్వే నంబర్ 462 లోని ప్రభుత్వ భూమిలో ప్యూజియన్ ప్రైవేటు స్కూల్ లో హైడ్రా ఆదేశాలతో రెవెన్యూ, మున్సిపల్ అధికారులు కూల్చివేతలు చేపట్టారు. సర్వేనెంబర్ 462 లో గల ప్రభుత్వ భూమిలోని 17 గుంటల్లో నిర్మించిన స్కూల్ గేటు, రూమ్స్, గ్రౌండ్ ను జేసీబీలతో కూల్చివేశారు. కూల్చివేతకు ఎవ్వరూ ఆటంకాలు కలిగించకుండా భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు.ప్రభుత్వ భూములను ఆక్రమిస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదన్నారు తహశీల్దార్ రాధా.

 

RELATED ARTICLES

Most Popular

Recent Comments