Tuesday, February 24, 2026
Homeక్రైమ్లక్షలు తీసుకోకుండా నా భార్య ఇంటికి రాదు.. డీఈ భర్త షాకింగ్ విడియో

లక్షలు తీసుకోకుండా నా భార్య ఇంటికి రాదు.. డీఈ భర్త షాకింగ్ విడియో

ఇటీవలే లంచం తీసుకుంటా ఏసీబీ చిక్కిన మణికొండ మున్సిపాలిటీ డీఈ దివ్య జ్యోతి కేసులో సంచలన విషయాలు బయటికి వస్తున్నాయి. ఆమె భర్తే షాకింక్ నిజాలు బయటపెట్టారు. లక్షలు తీసుకోకుండా నా భార్య ఇంటికి రాదు అంటూ డీఈ భర్త వీడియో రిలీజ్ చేశారు .అందులో తన ఇంట్లో కవర్లలలో ఉన్న డబ్బుల కట్టలను చూపించారు. రోజూ ఇలాంటి నోట్ల కట్టలు లేకుండా తన భార్య ఇంటికి రాదని వీడియోలో తెలిపారు డీఈ దివ్య జ్యోతి భర్త.

ప్రతిరోజు లంచం తీసుకురానిది ఇంటికి రాదని సంచలన ఆరోపణలు చేస్తున్న భర్త ..తాను తీసుకొచ్చిన లంచానికి ఇవే సాక్షాలు అంటూ ఇంట్లో కొన్ని వీడియోలు విడుదల చేశారు. ఇంట్లో ప్రతిచోట కట్టల కట్టల డబ్బులు చూపిస్తూ 20 నుండి 30 లక్షలు తీసుకొస్తుంది అంటూ ఆరోపణలు చేశారు. పెద్ద ఎత్తున మణికొండలో కాంట్రాక్టర్ ల నుంచి కమిషన్ను తీసుకుంటూ లంచాలు భారీగా ఇంటికి తీసుకువస్తుందని చెప్పారు.ఎన్నిసార్లు ప్రవర్తన మార్చుకోమని చెప్పిన మార్చుకొక పోవటంతో వీడియోలు మీడియాకు పంపించాడు డీఈ భర్త.

 

RELATED ARTICLES

Most Popular

Recent Comments