తెలంగాణ

రైతు రుణమాఫీ నిధులు విడుదల.. సంబరాలు జరుపుకున్న కాంగ్రెస్ పార్టీ శ్రేణులు

క్రైమ్ మిర్రర్, ములుగు(ప్రతినిధి) : జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు అధ్యక్షుడు పైడాకుల అశోక్ ఆధ్వర్యంలో రైతు రుణమాఫీ ని హర్శిస్తూ రాష్ట్ర పంచాయితీ రాజ్ గ్రామీణాభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ పిలుపు మేరకు బైక్ ర్యాలీ నిర్వహించి జిల్లా కేంద్రంలోని గాంధీ పార్క్ వద్ద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మంత్రి సీతక్క, తుమ్మల నాగేశ్వరరావు ల చిత్ర పటానికి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా పైడాకుల అశోక్ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాల సంక్షేమానికి కృషి చేస్తుందని, గత ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలుకు కట్టుబడి రూ.2 లక్షలు రైతు రుణమాఫీని ప్రభుత్వం చేస్తుందన్నారు.

Read Also : లంబాడ ఐక్యవేదిక ములుగు పట్టణ కమిటీ ఎన్నిక..

కాంగ్రెస్ పార్టీ రైతు పక్షపాతి అని, అనాదిగా రైతుల శ్రేయస్సు కోసం సంక్షేమం కోసం పాటుపడ్డ చరిత్ర కాంగ్రెస్ పార్టీది అని, తెలంగాణలో ముఖ్యమైన జల ప్రాజెక్టులన్ని కాంగ్రెస్ హాయంలోనే నిర్మించిన విషయాన్ని గుర్తు చేశారు. వ్యవసాయానికి పునఃవైభవం తీసుకువచ్చి రైతుల కళ్ళలో ఆనందం చూడాలన్నదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తపన అని, అందులో భాగంగా రూ.2 లక్షల రుణమాఫీని ఒకే దఫాలో చేయడంతో రైతులంతా ఆనందంతో సంబరాలు చేసుకుంటున్నారని పేర్కొన్నారు. రైతు సంక్షేమం కోసం కృషి చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ తోపాటు రైతులు పండించిన పంటలకు మద్దతు ధర కల్పించడంతో మెరుగైన మార్కెటింగ్ వ్యవస్థను కల్పించడానికి ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా బ్లాక్, మండల, గ్రామ నాయకులు, కార్యకర్తలు, రైతులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి : 

  1. వీధి కుక్కల దాడులపై హైకోర్టు సీరియస్.. పరిష్కార మార్గాలు అన్వేషించాలని ఆదేశాలు
  2. లారీ డ్రైవర్ పై దుర్భాషలాడిన ట్రాఫిక్ పోలీస్.. కేటీఆర్ ఆగ్రహం.. ఎస్‌ఐపై బదిలీవేటు!!
  3. వ్యాసమహర్షి పురస్కారాలకు చండూరు వాసుల ఎంపిక..
  4. డీఎస్సీ వాయిదాపై హైకోర్టులో విచారణ.. తదుపరి విచారణ ఆగస్టు 28కి వాయిదా
  5. అక్క భర్తను లవ్ చేసిన యువతి.. వద్దని చెప్పిన తల్లిదండ్రులు..చివరకు!!!

Back to top button