తెలంగాణ

రేవంత్ లాంటి హౌలాకు భయపడేది లేదు!

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై మాటల దాడి పెంచారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. మరోసారి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీల అమలు కోసం వాట్సాప్ లో ప్రశ్నించినందుకు భాస్కర్ ముదిరాజ్ అనే వ్యక్తిని మహబూబ్ నగర్ సీఐ అప్పయ్య బెల్ట్ తో కొట్టిన ఘటన పై కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధితుడు భాస్కర్ కు ఫోన్ చేసిన జరిగిన సంఘటన గురించి అడిగి తెలుసుకున్నారు. ప్రశ్నించే వ్యక్తులను కొట్టే హక్కు పోలీసులకు ఎక్కడిదని కేటీఆర్ ప్రశ్నించారు.

రేవంత్ రెడ్డి లాంటి హౌలా వ్యక్తుల బెదిరింపులకు భయపడేది లేదని కేటీఆర్ తేల్చిచెప్పారు. దాడికి పాల్పడిన సీఐ పై న్యాయ పరంగా పోరాటం చేయటంతో పాటు బీసీ కమిషన్, హ్యుమన్ రైట్స్ కమిషన్ కు కూడా వెళ్తామన్నారు. అక్రమ కేసులకు భయపడాల్సిన అవసరం లేదని…పార్టీ మొత్తం భాస్కర్ కు అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. రేవంత్ రెడ్డి సర్కార్ ఇచ్చిన హామీలు అమలు చేయాల్సింది పోయి అడిగిన వారిని ఇలా పోలీసులతో కొట్టించటం దుర్మార్గమైన చర్య అని ఈ సందర్భంగా కేటీఆర్ అన్నారు. పోలీసులు అధికార పార్టీ కార్యకర్తల్లా వ్యవహరించవద్దని సూచించారు. కాంగ్రెస్ పార్టీ అరాచకాలకు మద్దతుగా నిలుస్తున్న పోలీసులు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు.

మళ్లీ బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక ప్రతి ఒక్కరికీ మిత్తితో సహా చెల్లిస్తామన్నారు కేటీఆర్. బాధితుడు భాస్కర్ తో పాటు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తో నూ కేటీఆర్ మాట్లాడారు. భాస్కర్ విషయంలో ఎంత దూరమైన కలసికట్టుగా పోరాటం చేద్దామని ఆయనకు సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button