తెలంగాణ

రేవంత్ రెడ్డికి రాహుల్ క్లాస్.. అదాని 100 కోట్లు రిటర్న్

తెలంగాణ సర్కార్ తలపెట్టిన స్కిల్ యూనివర్శిటీకి అదానీ విరాళంగా ఇచ్చిన వంద కోట్ల రూపాయలు ఇప్పుడు కాక రేపుతున్నాయి. అదానీ ఇచ్చిన వంద కోట్ల విరాళాన్ని సీఎం రేవంత్ రెడ్డి తిరస్కరిస్తున్నట్లు ప్రకటించడం దేశవ్యాప్తంగా సంచలనమైంది. రేవంత్ ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక పెద్ద కథే ఉందనే చర్చ సాగుతోంది. అదానీని రాహుల్ గాంధీ తీవ్రంగా వ్యతిరేకిస్తుండగా.. రేవంత్ సర్కార్ ఆయనతో ఒప్పందాలు చేసుకోవడం.. విరాళాలు తీసుకోవడం పార్టీకి ఇబ్బందిగా మారింది. ఈ విషయంలోనే రేవంత్ రెడ్డిపై కాంగ్రెస్ హైకమాండ్ సీరియస్ గా ఉందని తెలుస్తోంది. రాహుల్ గాంధీ గుస్సా కావడం వల్లే విరాళాన్ని వెనక్కి ఇస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారని చెబుతున్నారు.

తెలంగాణ బీజేపీ నేతలు కూడా ఇదే చెబుతున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి, మంత్రులు సోయి లేకుండా, ఎజెండా లేకుండా కేవలం హెడ్లైన్స్ కోసం మాట్లాడుతున్నారని.. రేవంత్ రెడ్డి తన పదవికి దిగజారి రోజుకోమాట మాట్లాడుతున్నారని కాసం వెంకటేశ్వర్లు విమర్శించారు. రేవంత్ రెడ్డి మీద రాహుల్ గాంధీ గరంగరం ఉన్నడాని.. అందుకే ఢిల్లీకి వెళ్లేముందు అదానీ విరాళం వెనక్కి ఇచ్చారని చెప్పారు. అదానీ దగ్గర తీసుకున్న రూ.100కోట్ల చెక్ ను వాపస్ ఇస్తున్న అని చెప్పిండని.. ఎవరికి భయపడి చెక్ వాపస్ చేశారో రేవంత్ రెడ్డి చెప్పాలని కాసం డిమాండ్ చేశారు.

అగ్రిమెంట్ చేసుకున్నప్పుడు రాహుల్ గాంధీకి ఎందుకు భయపడలేదు.. చెక్ వాపస్ ఇవ్వకపోతే రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ ఇవ్వనని చెప్పాడా? అని కాసం ప్రశ్నించారు. అదానీ, ప్రధాని మోదీ మీద కాంగ్రెస్ సోకాల్డ్ నాయకులు రకరకాల మాటలు మాట్లాడుతున్నారని.. చట్టానికి ఎవరూ కూడా చుట్టాలుకారని..దోషులెవరైనా చట్టప్రకారం శిక్షపడుతుందని స్పష్టం చేశారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సత్యం కేసును ఎవరైనా ఆపగలిగారా? ..యూపీఏ ప్రభుత్వంలో సహారా కేసులో సుబ్రతా రాయ్ కి శిక్ష పడకుండా ఎవరైనా ఆపగలిగారా? చట్టం ముందు దోషులుగా తేల్చలేదా? కాంగ్రెస్ నాయకులు చట్టం గురించి తెలియకుండ మాట్లాడుతున్నారా? రూ.12వేల కోట్ల ప్రాజెక్టును కూడా రద్దు చేస్తున్నారా రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలని కాసం అన్నారు.

రాష్ట్రంలో పోలీసులే ధర్నాలు చేయాల్సిన పరిస్థితి వచ్చిందని.. అవన్నీ మరచిపోయి రేవంత్ రెడ్డి మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ విదేశీ పర్యటనల మీద ఇష్టానుసారంగా మాట్లాడారని కాసం మండిడ్డారు. మహారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీ 16స్థానాలకే పరిమితమై తోకపార్టీగా మారిపోయిందన్నారు.ఒవైసీ బ్రదర్స్ ని బ్రతిమిలాడుకొని నాందేడ్ పార్లమెంటు సీటు గెలిచారని తెలిపారరానున్న రోజుల్లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి మహారాష్ట్రలో పట్టిన గతే పట్టిస్తామని హెచ్చరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button