
సైబర్ కేటుగాళ్లు రెచ్చిపోతున్నారు. న్యూడ్ కాల్స్ చేస్తూ .. బెదిరిస్తూ డబ్బులు వసూల్ చేస్తున్నారు. తాజాగా ఏకంగా అధికార పార్టీ ఎమ్మెల్యేనే సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడ్డారు. నల్గొండ జిల్లాకు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యేకు న్యూడ్ కాల్ చేసి.. ఆ వీడియోను రికార్డ్ చేసి బెదిరించారు కేటుగాళ్లు.
న్యూడ్ కాల్ ఉచ్చులో ఇరుక్కున్నారు నకిరేకల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే వేముల వీరేశం. వేముల వీరేశంకు న్యూడ్ కాల్ చేసిన సైబర్ నేరగాళ్లు. క్షణాలపాటు దాన్ని స్క్రీన్ రికార్డు చేసి ఆయనకే పంపి డబ్బులు డిమాండ్ చేశారు సైబర్ నేరాగాళ్లు .ఆయన స్పందించకపోవడంతో ఆ వీడియోను కొందరు కాంగ్రెస్ నేతలకు పంపారు. దీంతో నిందితులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు కాంగ్రెస్ ఎమ్మెల్యే వేముల వీరేశం