Tuesday, February 24, 2026
Homeతెలంగాణరేవంత్‌కు దండం పెట్టిన వీహెచ్.. గాంధీభవన్ లో అంతా షాక్

రేవంత్‌కు దండం పెట్టిన వీహెచ్.. గాంధీభవన్ లో అంతా షాక్

క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో : తెలంగాణ కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా గాంధీభవన్ లో నిర్వహించిన సభలో సీనియర్ నేత వీ హనుమంతరావు స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. ఓపెనింగ్ స్పీచ్ లో అదరగొట్టారు వీహెచ్. కులగణన మొదలు పెట్టు రేవంత్ రెడ్డి నీకు దండం పెడుతా
అంటూ నిండు సభలో వొంగి వొంగి దండం పెట్టారు. బీసీలు ఓట్లు వేస్తేనే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్నారు వీహెచ్. వేరేవాళ్లకు పీసీసీ వెళ్లొద్దు అని నీకు మద్దతు ఇచ్చాను మహేష్ అని కామెంట్ చేశారు. రేవంత్ సహకారం తీసుకోవాలని సూచించారు. కాంగ్రెస్ లో అసలైన కార్యకర్తలకు మాత్రమే పదవులు దక్కాలని తేల్చి చెప్పారు వీహెచ్.

Read More : కేబినెట్ లోకి రాజగోపాల్ రెడ్డి!ఢిల్లీ నుంచి సీఎం రేవంత్ సిగ్నల్

తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చీఫ్ గా బొమ్మ మహేశ్ కుమార్ గౌడ్ సీఎం రేవంత్ రెడ్డి నుంచి బాధ్యతలు స్వీకరించారు. మహేశ్ కుమార్ గౌడ్ కు జెండాను ఇచ్చారు రేవంత్ రెడ్డి. PCC చీఫ్ గా పార్టీని ముందుకు తీసుకెళ్లాలని మహేశ్ కు సూచించారు.

అంతకుముందు మహేశ్ కుమార్ గౌడ్ తన నివాసం నుంచి భారీ ర్యాలీగా వచ్చారు. గన్ పార్క్ నుంచి గాంధీభవన్ వరకు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలతో భారీ ర్యాలీగా వచ్చారు.తన ఛాంబర్ లో నిర్వహించిన పూజల్లో సీఎం పాల్గొన్నారు. కార్యక్రమంలో సీఎంతో పాటు మంత్రులు, ముఖ్యనేతలు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments