తెలంగాణ

రేవంతన్న వరం.. దండం పెట్టిన సీతక్క

తెలంగాణ మంత్రివర్గంలో మంత్రి సీతక్క వెరీ స్పెషల్. సీఎం రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితురాలు ఎవరన్న ఉన్నారంటే ఆమె సీతక్కే. కేబినెట్ లో ఆమెకు హోంశాఖ ఇస్తారనే ప్రచారం కూడా సాగింది. పీసీసీ రేసులోనూ ఆమె పేరు వినిపించింది. అయితే ఏశాఖ మంత్రిగా ఉన్నా రేవంత్ కేబినెట్ లో ఆమె పవర్ ఫుల్ అని చెప్పక తప్పద. సీఎం రేవంత్ రెడ్డి కూడా సీతక్క ఏం అడిగినా వెంటనే ఇచ్చేస్తున్నారు. దీంతో తమ ప్రాంత అభివృద్ధి కోసం సాధ్యమైనన్ని నిధులు తీసుకెళుతున్నారు సీతక్క.

తాజాగా సీతక్క కోరిన వెంటనే మరో వరం ప్రకటించారు సీఎం రేవంత్ రెడ్డి. ములుగు జిల్లాలో ఫైర్ స్టేషన్ ఏర్పాటు చేయాలని కోరారు. సీతక్క కోరిక మేరకు ఏటూరునాగారంలో ఫైర్ స్టేషన్ ఏర్పాటు చేయబోతున్నారు. ఇందుకు రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆమోదముద్ర వేశారు.ఏటూరు నాగారం ఫైర్ స్టేషన్ కు 35 మంది సిబ్బందిని కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఏజెన్సీలో ఈ ఫైర్ స్టేషన్ ఎంతో ప్రయోజకనరంగా ఉంటుందనే టాక్ వస్తోంది. అంతేకాదు ములుగు మెడికల్ కాలేజీకి 433 పోస్టులు మంజూరును క్యాబినెట్ ఆమోదించింది. దీంతో ములుగు మెడికల్ కాలేజ్ పూర్తిస్థాయిలో అందుబాటులోకి రానుంది.

ములుగు నియోజకవర్గ అభివృద్ధి కోసం క్యాబినెట్ పలు నిర్ణయాలకు ఆమోదం తెలపడం పట్ల మంత్రి సీతక్క హర్షం వ్యక్తం చేశారు. ఏటూరు నాగారం ప్రజల దశాబ్దాల కలను నెరవేర్చిన, ములుగు ప్రజలకు వైద్య సేవలను అందుబాటులోకి తెచ్చేందుకు ములుగు మెడికల్ కాలేజీకి 433 మంది వైద్య సిబ్బందిని మంజూరు చేసిన సీఎం రేవంత్ రెడ్డికి మంత్రి సీతక్క ధన్యవాదాలు తెలిపారు.ఏటూరు నాగారం ఫైర్ స్టేషన్ ఏర్పాటు తో పాటు, ఫైర్ స్టేషన్ కి 35 మంది సిబ్బందిని మంజూరు చేసినందుకు సంతోషం వ్యక్తం చేశారు. మారుమూల ప్రాంతం, అటవీ ప్రాంతం అయిన ఏటూరు నాగారంలో ఫైర్ స్టేషన్ ఏర్పాటు అయితే..ఎన్నో అగ్ని ప్రమాదాలను నివారించ గలుగుతామని మంత్రి సీతక్క తెలిపారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button