Homeతెలంగాణరేపటి నుంచి మళ్లీ భారీ వర్షాలు.. ఈ జిల్లాలకు అలెర్ట్

రేపటి నుంచి మళ్లీ భారీ వర్షాలు.. ఈ జిల్లాలకు అలెర్ట్

క్రైమ్ మిర్రర్, హైదరాబాద్ :  తెలంగాణలో కాస్త గ్యాప్‌ తరువాత మళ్లీ వర్షాలు కురవనున్నాయి. రేపటి నుంచి అంటే సెప్టెంబర్ 20, 21 తేదీల్లో తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ అంచనా వేసింది. ఈ మేరకు పలు జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. 20న ఆసిఫాబాద్, ఆదిలాబాద్, నిర్మల్, పెద్దపల్లి, కరీంనగర్, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, నిజామాబాద్, జగిత్యాల, మంచిర్యాల, రాజన్న సిరిసిల్ల, జయశంకర్ భూపాలపల్లి, వరంగల్, హనుమకొండ, జనగాం, మేడ్చల్ మల్కాజిగిరి, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో మోస్తరు నుంచి తేలిక పాటి వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ తెలిపింది. ఉదయం ఎండకాసినా.. సాయంత్రానికి వాతావరణం చల్లబడి వర్షాలు కురుస్తాయని చెప్పారు.

Read More : కరెంట్ చార్జీలు భారీగా పెంపు.. తెలంగాణ ప్రజలకు షాక్

ఇక 21న ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, పెద్దపల్లి, రాజ్నన సిరిసిల్ల, కరీంనగర్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిలాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయన్నారు. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. బలమైన ఉపరితల గాలులు గంటకు 30-40 కి.మీ వేగంతో వీచే అవకాశం ఉందన్నారు. ఇదిలా ఉంటే గత రెండు రోజులుగా తెలంగాణలో పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు పెరిగి ఎండలు దంచికొడుతున్నాయి.

తాజావార్తలు