-
బ్లాక్ మెయిల్ అంబాసీడర్‌గా సీఎం రేవంత్
-
రాష్ర్ట సంపదను దోచుకుంటున్న సీఎం, మంత్రి పొంగులే
-
హౌజ్ కమిటీలకు విలువలేదనడం బాధాకరం
హైదరాబాద్, క్రైమ్ మిర్రర్: తెలంగాణలో అరాచక పాలన నడుస్తుందని, కాంగ్రెస్ నాయకులు అందినకాడికి దోచుకుంటున్నారని బీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎద్దేవా చేశారు. సోమవారం లోక్భవన బయట విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బీఆర్ ఎస్ శాసనసభ పక్షం భేటి అయి రాఘవ కన్స్ర్టక్షన్ ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. రాష్ర్టంలో జరుగున్న అరాచక పాలనపై ఫిర్యాదు చేశామని తెలిపారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రజా సంపదను కొల్లగొడుతున్నారన్నారు. హిమాయత్ సాగర్ పరిధిలో నిబంధనలు, ఓఆర్ఆర్ పరిధిలో నిబంధనలు తుంగలో తొక్కి అక్రమ మైనింగ్ చేస్తున్నారన్నారు. ఎటువంటి పర్మిషన్ లేకుండా వందల కోట్ల ప్రజా సంపద కొల్లగొడుతున్నారన్నారు. ఇదే విషయమై మాప నాయకుడు హరీష్ రావు అసెంబ్లీలో లేవనెత్తితై ఎదురుదాడి చేశారని గుర్తు చేశారు. అక్రమ మైనింగ్ పై సిబి సిఐడి విచారణ చేయిస్తామని సీఎం అంటున్నారు. మేము హౌస్ కమిటీ వెయ్యాలని డిమాండ్ చేశాము.
హౌస్ కమిటీలకు విలువ లేదని మంత్రి శ్రీధర్ బాబు అనడం విడ్డూరంగా ఉందన్నారు. పార్లమెంట్ లో రాహుల్ గాంధీ హౌస్ కమిటీకి అనేక సార్లు డిమాండ్ చేశారు. ఇక్కడేమో హౌస్ కమిటీలకు విలువ లేదని ప్రభుత్వం అనడం ఎంత వరకు సబబుని అన్నారు. సిబి సిఐడి రాష్ట్ర ప్రభుత్వంలో ఒక విభాగం , మంత్రి పై విచారణ నిష్పక్షపాతంగా జరగదని, మంత్రి వర్గం నుంచి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డినీ భర్తరఫ్ చెయ్యాలని డిమాండ్ చేశారు.
ఇదే విషయం పై ఈ రోజు మండలిలో మా ఎమ్మెల్సీలు నిలదీస్తే వారిని సస్పెండ్ చేశారు. ప్రభుత్వ పెద్దలే గద్దలుగా మారితే, రక్షకులే భక్షకులు అయితే ఎలా ప్రజలకు ఎవరు దిక్కు అని ప్రశ్నించారు. దీనిపై హైకోర్టుతో జడ్జీతో విచారణ చేయించాలని గవర్నర్‌కు తెలిపామన్నారు. ఎమర్జెన్సీ ఇందిరమ్మ పాలన తెలంగాణ కొనసాగుతుందని విమర్శించారు. బ్లక్ మెయిల్‌కు బ్రాండ్ అంబాసీడర్‌గా సీఎం రేవంత్ రెడ్డి మారారన్నారు.
రైట్ టూ ఇన్ఫర్మేషన్ ను , రూట్ టూ ఇన్ కమ్ గా రేవంత్ రెడ్డి మార్చుకున్నాడు. బ్లాక్ మెయిల్ రాజకీయాలు రేవంత్ రెడ్డికి తెలిసినంతగా ఈ దేశంలో ఎవరికి తెలియదన్నారు. 14 అంశాల పై విచారణ చెయ్యండి అని సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశామని వెల్లడించారు.
