క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : తెలంగాణలోని అన్ని జిల్లాలకు మోస్తరు నుంచి భారీ వర్షాలు పడేఅవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ సూచించింది. దక్షిణ – ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. మధ్య ట్రోపోస్పీయర్ వరకు ఆవర్తనం విస్తరించింది. జైసాల్మయిర్, కోట, గుణ, కళింగపట్నం గుండా వెళుతూ మధ్య బంగాలఖాతం వరకు సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో ఋతుపవన ద్రోణి కొనసాగుతుంది. గాలి విచ్చిన్నతి 20 డిగ్రీల ఉత్తర అక్షాంశం గుండా సగటు సముద్ర మట్టానికి 3.1 కి. మీ. నుండి 5.8 కి. మీ ఎత్తు మధ్యలో కొనసాగుతుంది. దీంతో రాగాల రెండు మూడు రోజులలో రాష్ట్రంలో కొన్ని జిల్లాలలో అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు, అక్కడ అక్కడ భారీ వర్షాలు కొన్ని కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఉరుములు, మెరుపులుతో గంటకు 30 నుండి 40 కి. మీ మేర, అప్పుడప్పుడు 50 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. ఉమ్మడి.. ఆదిలాబాద్, హైదరాబాద్, నిజామాబాద్, మెదక్, వరంగల్, నల్లగొండ, కరీంనగర్,రంగారెడ్డి, సంగారెడ్డి, ఖమ్మం, మహబూబ్ నగర్ జిల్లాకు వర్ష సూచన జారీ అయ్యింది. ఇక రాగాల 24 గంటలలో హైదరాబాద్ నగర వ్యాప్తంగా మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది.
ఇవి కూడా చదవండి :
- చండూరులో ఘనంగా మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి జన్మదిన వేడుకలు
- రుణమాఫీ నిధులు విడుదల.. రైతువేదికల వద్ద సంబురాలు!!
- రైతు రుణమాఫీ నిధులు విడుదల.. సంబరాలు జరుపుకున్న కాంగ్రెస్ పార్టీ శ్రేణులు
- వీధి కుక్కల దాడులపై హైకోర్టు సీరియస్.. పరిష్కార మార్గాలు అన్వేషించాలని ఆదేశాలు
- లారీ డ్రైవర్ పై దుర్భాషలాడిన ట్రాఫిక్ పోలీస్.. కేటీఆర్ ఆగ్రహం.. ఎస్‌ఐపై బదిలీవేటు!!