
క్రైమ్ మిర్రర్, జాతీయ న్యూస్ :- రష్యా అధ్యక్షుడు పుతిన్ మన భారతదేశంలో రెండు రోజులపాటు పర్యటించనున్న విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఇప్పటికే ఈ పర్యటనకు సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా భారత సంబంధిత అధికారులు ఏర్పాటు చేశారు. ఇక ఈ నేపథ్యంలోనే పుతిన్ పర్యటన షెడ్యూల్ వివరాలను అధికారులు వెల్లడించారు.
పుతిన్ భారత పర్యటన షెడ్యూల్ :-
1. ఈరోజు సాయంత్రం 6:35 గంటలకు ఢిల్లీకి రానున్నారు.
2. రేపు ఉదయం 11 గంటలకు రాష్ట్రపతి భవన్ లో స్వాగత కార్యక్రమం ఉంటుంది.
3. 11:30 గంటలకు మహాత్మా గాంధీ సమాధి వద్ద పుతిన్ నివాళి అర్పిస్తారు.
4. 11:50 గంటలకు ప్రధాని మోదీతో భేటీ ఉంటుంది. ఈ భేటీలో కీలక విషయాలను చర్చించనున్నారు.
5. 4:00 pm కు బిజినెస్ ఈవెంట్లో పాల్గొంటారు.
6. 5:00pm కు మీడియా సమావేశం ఉంటుంది.
7. ఇక 7:00 p.m కు రాష్ట్రపతి మురుముతో కీలక సమావేశంలో పాల్గొననున్నారు.
కాగా ఇప్పటికే ఇరుదేశాల మధ్య మంచి ద్వైపాక్షిక సంబంధాలు ఉన్న విషయం తెలిసిందే. ప్రధాన మోడీ అలాగే పుతిన్ మధ్య కూడా మంచి సన్నిహిత్యం ఉంది. కాబట్టి ఇరుదేశాలకు సంబంధించి ఈ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే ఎంతోమంది మహిళలు మోడీ, పుతిన్ జిందాబాద్ అంటూ… పుతిన్ కు ఘన స్వాగతం పలికేలా ఏర్పాట్లు కూడా చేసుకున్నారు. ఈ ఇరుదేశాల మధ్య ఈ సత్సంబంధాలు ఇలానే కొనసాగాలి అని చాలామంది కూడా కోరుకుంటున్నారు.
Read also : హ్యాక్‌కు గురైన రాచకొండ, సైబరాబాద్ పోలీస్ వెబ్‌సైట్లు..!





