వినాయక చవితి సంబరాలతో కూల్చివేతలకు బ్రేక్ ఇచ్చిన హైడ్రా మళ్లీ యాక్షన్ లోకి దిగింది. హైడ్రాకు విశేషాధికారులు కల్పిస్తూ కేబినెట్ భేటీలో నిర్ణయం తీసుకున్న కొన్న గంటల్లోనే రెట్టించిన ఉత్సాహంతో హైడ్రా ఎంట్రీ ఇచ్చింది. అక్రమ కట్టడాలను నేలమట్టం చేసింది.
కోకాపేట్ లో అక్రమ నిర్మాణాల పై కొరడా ఝులిపించింది హైడ్రా. స్థానిక రెవెన్యూ అధికారుల సహకారంతో తెల్లవారుజామునే కూల్చివేతలు చేపట్టింది. కోకాపేట సర్వే నెంబర్ 147లో వెలసిన అక్రమ నిర్మాణాలను తొలగించారు అధికారులు. జేసీబీల సహాయంతో అక్రమ నిర్మాణాలను కూల్చివేశారు. పోలీసుల భారీ బందోబస్తు నడుమ కూల్చివేతల పర్వం కొనసాగింది. ప్రభుత్వ భూమిని కబ్జా చేసిన కబ్జా దారుల గుండెల్లో రైళ్లు పరిగెట్టిస్తున్నారు గండిపేట తహసీల్దారు.