క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : తెలంగాణ రాష్ట్రంలో భక్తుల కొంగుభంగరమై విరాజిల్లుతున్న యాదగిరిగుట్ట పంచ నారసింహుల చెంత ప్రతి నెల గిరిప్రదక్షిణ చేపట్టడం ఆనవాయితీగా వస్తోంది. గత నెల చేపట్టిన గిరిప్రదక్షిణలో ఊహించని రీతిలో 10వేల మంది భక్తులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా విస్తృత ప్రచారం జరిగిన నేపథ్యంలో సోమవారం ప్రదక్షిణలో భారీగా భక్తులు పాల్గొన్నారు. కొండచుట్టూ రెండున్నర కిలోమీటర్లు కొనసాగే ఈ గిరి ప్రదక్షిణ 6.05 గంటలకు వైకుంఠ ద్వారం నుంచి ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్యతోపాటు కలెక్టర్ పాల్గొన్నారు. గిరిప్రదక్షిణ సమయంలో వ్రత మండపం, సంస్కృత పాఠశాల, అన్నదాన సత్రం, గిరిప్రదక్షిణ రోడ్డుకు ఇరువైపులా, మల్లాపురం వద్ద గోశాల తదితర ప్రాంతాల్లో మొక్కలు నాటేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. రెండు వేల మొక్కలు నాటేందుకు అధికారులు ప్రణాళికలు రూపొందించారు.
ఇవి కూడా చదవండి :