క్రైమ్

హిజ్రాలపై పోలీసుల ఉక్కుపాదం… యువతను చెడు మార్గం వైపు తిప్పుతున్నారని ఆగ్రహం

  • అర్ధరాత్రి వీధుల్లో హిజ్రాల అనుచిత చర్యలు

  • హిజ్రాల కట్టడికి పోలీసుల ప్రత్యేక కార్యాచరణ

క్రైమ్ మిర్రర్ ప్రతినిధి, హైదరాబాద్: వీధుల్లో రాత్రి వేళల్లో యువతను బుట్టలో పడేసే ప్రయత్నాలు, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న హిజ్రాలపై పోలీస్ శాఖ ఉక్కుపాదం మోస్తోంది. ఇటీవల యువతకు చెడు అలవాట్లు, చిత్తశుద్ధికి భంగం కలిగించే చర్యలు పెరుగుతున్న నేపథ్యంలో పోలీసులు రాత్రివేళల్లో ప్రత్యేక డ్రైవ్‌లను చేపడుతున్నారు.

రాత్రివేళల్లో స్పెషల్ డ్రైవ్‌లు

పోలీసు అధికారుల వివరాల ప్రకారం, ప్రధాన రహదారులు, టౌన్ కూడళ్లు, కాలనీలు తదితర ప్రాంతాల్లో అర్ధరాత్రి నుంచి ఉదయం వరకు పహారా కొనసాగిస్తున్నారు. అనుమానాస్పదంగా తిరుగుతున్న వారిని అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నారు. యువతను బెదిరించడం, డబ్బులు వసూలు చేయడం, అసాంఘిక చర్యలకు పాల్పడడం వంటి ఘటనలపై పటిష్ట చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు వెల్లడించారు.

హిజ్రాలపై ప్రత్యేక నజర్

ప్రస్తుతం చెడుపనులకు పాల్పడుతున్న హిజ్రాల గుంపులపై ప్రత్యేక నిఘా కొనసాగుతోంది. కొంతమంది హిజ్రాలు రాత్రివేళల్లో యువతను లక్ష్యంగా చేసుకుని రోడ్డుమీద తిరుగుతూ డబ్బులు వసూలు చేయడం, బెదిరించడం, మరికొంతమంది నేరచర్యలకు పాల్పడుతున్నట్టు పోలీసులు గుర్తించారు. వాటిపై కేసులు నమోదు చేసి, వారిని అదుపులోకి తీసుకుంటున్నామని తెలిపారు.

ప్రజలకు సూచనలు

ఈ తరహా సంఘటనలు ఎదురైన వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని, రహదారులపై అపరిచితులను ఆశ్రయించవద్దని పోలీసులు సూచిస్తున్నారు. ప్రజల సహకారం ద్వారా మాత్రమే సమాజాన్ని చెడుపనుల నుంచి కాపాడగలమని వారు పేర్కొన్నారు.

Read Also: 

  1. పెద్దకొత్తపల్లి రెసిడెన్షియల్‌ స్కూల్‌లో ఫుడ్‌ పాయిజన్‌… 30మంది విద్యార్థులకు అస్వస్థత, ఆస్పత్రికి తరలింపు
  2. ఆపరేషన్‌ సిందూర్‌తో సత్తా చాటాం… యాక్సియం-4 మిషన్‌పై మోదీ ప్రశంసలు
Back to top button