తెలంగాణ

బుల్డోజర్స్ ఆన్ డ్యూటీ రాంనగర్‌లో ఇండ్లు నేలమట్టం

క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో : హైడ్రా తగ్గేదే లే అంటోంది. కబ్జాదారులపై ఉక్కుపాదం మోపుతోంది. హైదరాబాద్ పరిధిలో మళ్లీ బుల్డోజర్లు డ్యూటీలోకి వచ్చాయి. జీహెచ్ఎంసీ పరిధిలోని అక్రమ కట్టడాలపై హైడ్రా ఆపరేషన్ కొనసాగుతోంది. ఎఫ్టీఎల్, బఫర్ జోన్, నాలాలు, కుంటలను ఆక్రమించి నిర్మించిన అక్రమ కట్టడాలను ఎక్కడికక్కడ హైడ్రా అధికారులు కూల్చేస్తున్నారు. ముషీరాబాద్ నియోజకవర్ంగ రామ్ నగర్‎లోని మణెమ్మ బస్తీలోని అక్రమ కట్టడాలపై హైడ్రా ఫోకస్ పెట్టింది. మణెమ్మ కాలనీలో నాళాను ఆక్రమించి నిర్మించిన కట్టడాల్లో హైడ్రా అధికారులు కూల్చివేతలు చేపట్టారు. నాళాపై నిర్మించిన అక్రమ కట్టడాలను జేసీబీలతో నేలమట్టం చేస్తున్నారు.

ఉదయం నుండి కూల్చివేతలు మొదలుపెట్టిన అధికారులు.. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. రామ్ నగర్‎లోని అక్రమ కట్టడాలను హైడ్రా కమిషనర్ రంగనాథ్ క్షేత స్థాయిలో పర్యటించిన 24 గంటల్లోనే ఈ కూల్చివేతలు మొదలయ్యాయి. రెండు రోజుల క్రితం ఈ నాలాను సందర్శించారు హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్. నాలా కబ్జాపై స్థానికులు ఆయన ఫిర్యాదు చేశారు. నాలాను ఆక్రమించడంతో వరద నీరు పోయే పరిస్థితి లేక వరద నీరు ఇండ్లలోకి వస్తుందని స్థానికులు ఆయనకు వివరించారు. దీంతో రెండు రోజుల్లోని యాక్షన్ లోకి దిగాయి బుల్డోజర్లు.

Read More : సీఎం రేవంత్ సోదరుడి ఇల్లు నేలమట్టం! హైడ్రా సంవలనం

మరోవైపు హైడ్రా కూల్చివేతలపై స్థానికలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలో అధికారులు పర్మిషన్ ఇవ్వడంతోనే ఇళ్లు కట్టుకున్నామని.. ఇప్పుడు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా ఇళ్లు కూల్చివేడయం ఏంటని హైడ్రా అధికారులు, సిబ్బందితో వాగ్వాదానికి దిగుతున్నారు. దీంతో రామ్ నగర్‎లో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button