తెలంగాణ

బుల్డోజర్లు దింపాల్సిందే..హైడ్రాకు జనం సపోర్ట్..నాగార్జునకు షాక్

క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో : చెరువులు, ప్రభుత్వ భూముల్లో అక్రమంగా నిర్మించిన కట్టడాలను కూల్చేస్తున్న హైడ్రాకు రోజురోజుకు మద్దతు పెరుగుతోంది. హైడ్రా గత వారం రోజులుగా 60కి పైగా అక్రమ కట్టడాలను నేలమ్టటం చేసింది. మణికొండ, గండిపేట, అమీన్ పూర్ లో పెద్ద పెద్ద భవంతులను బాంబులతో పేల్చి ధ్వంసం చేసింది. హైడ్రా ఆపరేషన్ తో దాని బాధ్యతలు చూస్తున్న ఐపీఎస్ ఏవీ రంగనాథ్ నగర ప్రజల్లో హీరోగా మారిపోయారు. అంతేకాదు తన ప్రాంతాల్లోని అక్రమ కట్టడాలపై రంగనాథ్ కు కలిసి ఫిర్యాదు చేస్తున్నారు జనాలు. హైడ్రాను రద్దు చేయవద్దు.. అక్రమార్కులపై బుల్డోజర్లు దింపాల్సిందేననే డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఈ నెల 2న హైడ్రాకు మద్దతుగా వాక్ కూడా నిర్వహిస్తున్నారు .గండిపేట పార్క్ వద్ద ఈ వాక్ జరగనుంది. హైడ్రాను రద్దు చెయ్యొద్దు ఇలాగే కొనసాగించాలని వాకర్లు కోరుతున్నారు.

ఇక హీరో నాగార్జునకు హైడ్రా సెగ తగిలింది. కబ్జా కోరలనుండి శేరిలింగం పల్లి పరిధిలోని తమ్మిడి చెరువు ను కాపాడాలని కోరుతూ ‘హైడ్రా’ కమీషనర్ రంగనాథ్ ను ‘జనం కోసం’ అధ్యక్షుడు కసిరెడ్డి  భాస్కరరెడ్డి కలిసి పిర్యాదు చేశారు. శేరిలింగంపల్లి ప్రాంతంలోని హైటెక్ సిటీ వద్ద యన్ కన్వెన్షన్  పేరుతో అక్కినేని నాగార్జున కబ్జా చేసిన ‘తమ్మిడి చెరువు’ వివరాలను, పూర్తి విస్తీర్ణం, ఎఫ్.టీ.ఎల్. బఫర్ జోన్ మ్యాపులతో సహా నాగార్జున కబ్జా చేసిన చెరువు 3 ఎకరాల 30 గుంటల వివరాలను ఆధారాలతో  ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.

Read More : జనంలోకి కేసీఆర్.. ముహుర్తం ఫిక్స్.. ఆయనకు చుక్కలే! 

చెరువులను కాపాడడం చాలా గొప్ప విషయమని, గత 10 సంవత్సరాల్లో చెరువులు నాశనమయ్యాయని కమిషనర్ దృష్టికి తీసుకువెళ్లగా చెరువుల రక్షణలో  ‘జనం కోసం’ సహకారం తీసుకుంటామని, ఆక్రమణలు ఉన్నచోట కఠిన చర్యలు కూడా ఉంటాయని  సానుకూలంగా స్పందించినట్లు కసిరెడ్డి చెప్పారు.‘తమ్మిడి చెరువు’ పూర్తి విస్తీర్ణం 29 ఎకరాల 24 గుంటలతో పాటు కబ్జా జరిగిన చెరువును పూర్తి స్థాయిలో పుణరుద్ధరించి చెరువును అభివృద్ధి చేయాలని ‘హైడ్రా’ కమీషనర్ ను  కోరినట్లు తెలిపారు.

Back to top button